వెయ్యి అబద్ధాలకు వెయ్యి రోజులు
కుర్చీ ఎక్కేవరకు ఒక మాట కుర్చీ ఎక్కినాకా ఇంకొకటా? ఊకదంపుడు మాటలు, బూతులే పాలనా?
కుర్చీ ఎక్కేవరకు ఒక మాట
కుర్చీ ఎక్కినాకా ఇంకొకటా?
ఊకదంపుడు మాటలు, బూతులే పాలనా?
త్యాగాలు చేసి తెచ్చుకున్న తెలంగాణలో
చదువు కోసం వెళ్లిన బిడ్డల సావులా?
మా బిడ్డల్ని చంపే అధికారం మీకెక్కడిది?
తెలంగాణ జీవధార కాళేశ్వరం
అదే నిజం… తెలంగాణకు ఆధారం అదే
దుక్కులు దుఃఖిస్తుంటే… రైతులు శోకిస్తుంటే
పరిష్కారం చూపనివారూ నాయకులేనా?
నెర్రలుబారిన నేలలపైన
కుర్చీలపై కూర్చున్న నక్కలెవ్వరో?
నఖల్లేమిటో నిజరూపాలేమిటో తెలుసు
నీళ్లు, నిధులు, నియామకాల్లో అన్యాయం
కారకులెవరో చరిత్రనే సమాధానం?
నల్లగొండ ఫ్లోరోసిస్ ఎవరి పాపమో
ఆ పీడను వదిలించిన పాలకులెవరో?
పాలమూరు నుంచి స్తంభాద్రి
కోటిలింగాల నుంచి వేయిస్తంభాలు
బోధన్ నుంచి బాసర
భాగ్యనగరం నుంచి అనంతగిరి
నల్లగొండ నుంచి నడిగూడెం వరకు
తెలంగాణను తెర్లు చేసిన దొంగలెవరు?
రూపం మారిన గిరీశాలను చూసి
అబద్ధాలే గజగజ వణుకుతున్నయ్
అధికారం కలెక్షన్ల కౌంటర్లయ్యాక
ప్రజాస్వామ్యం బిక్కచచ్చిపోతుంటే
వెలుగుమట్లలు చీకటిమట్లలవుతుంటే
కూల్చిన ఇండ్ల కింద బీదల రోదనలు
వెయ్యి అబద్ధాలకు వెయ్యి
రోజులచ్చినయ్
అవునిప్పుడు నడుస్తుంది అబద్ధాల పాలనే
హామీలు అటకెక్కినయ్
గ్యారంటీలు గుర్రుపెడుతున్నయ్
నీతిని మరచిన బూతు
భాషకు వెయ్యి రోజులు
పునర్నిర్మాణ పాలనపై విషంగక్కిందెవరు?
ఒక్కొక్కసారి అబద్ధాలు గద్దెలెక్కుతాయ్
పోన్లే అని వదిలేస్తే గద్దల్లా తన్నుకుపోతయ్
420 వాగ్దానాలు మరిస్తే ఏమనాలె?
తెలంగాణ సమాజమే జవాబు చెప్పాలి
దుష్టపాలన తుదముట్టించే
తెలంగాణ రక్షకుడు మళ్లీ రావాలి.
తెలంగాణ సాధకులే పునర్నిర్మాణ
పాలకులు కావాలి
చెరబట్టినప్పు్పడు బంధవిముక్తి చేసే
నాయకుడు రావాలి
అబద్ధాలను నమ్మినందుకు జనం నాలుక కరుచుకుంటున్నరు
పెద్దాయన చెప్పిందే నిజమైంది
తప్పు్పచేస్తే తెర్లు తప్పవన్నది నిరూపితమైంది
మోసాన్ని ఇడిస్తే అసలుకే మోసం
అత్యాధునిక గిరీశాలు పాలకుయ్యాక
అబద్దములే వర్ధిల్లుతున్నయ్
బూతులే నీతులవుతున్నయ్
జులుం జడలువిప్పు్పతది
పెత్తనాలకు ముగింపు పలకాలే…
ఆధిపత్యాలకు అంతం పలికేదే తెలంగాణం.
జూలూరు
గౌరీశంకర్
Read Today's Latest Editpage News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ranabaali | రణబాలి ట్విట్టర్ రివ్యూ.. విజయ్ దేవరకొండ నటనకు ప్రశంసలు, కథనంపై మిశ్రమ స్పందన!
Bigg Boss 10 | బిగ్బాస్లో షాలిని, రోహిత్ మధ్య బ్రేకప్ వార్.. టాస్క్లో ఓటమితో వంశీ కన్నీళ్లు!
Caller ID | కాలర్ పేరు ప్రదర్శించడం తప్పనిసరి.. టెలికం కంపెనీలకు కేంద్రం ఆదేశం
Paper Leak | 8 ఏండ్లుగా పేపర్ లీక్లే లేవట.. NTAపై కేంద్ర విద్యా శాఖ నివేదిక
Reservations | మతం మారితే రిజర్వేషన్ వర్తించదు.. సుప్రీంకోర్టు కీలక తీర్పు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

