హైదరాబాద్, జూన్ 11 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర మంత్రివర్గంలోని కొందరు మంత్రులకు కొత్తగా ల్యాండ్ క్రూజర్ కార్లను ప్రొటోకాల్ డిపార్ట్మెంట్ మంగళవారం కేటాయించినట్టు తెలిసింది. అయితే, కొత్తవి కొన్నారా? పాత వాహనాలనే మంత్రులకు ఇచ్చారా? అనే అనుమానాలు కలుగుతున్నాయి. మరోవైపు కార్ల కోసం సీఎం దుబారా ఖర్చు చేస్తున్నారని నెటిజన్ల పెదవి విరుస్తున్నారు. గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి కాన్వాయ్ కోసం కొత్తగా అత్యాధునిక వ్యవస్థ కలిగిలిన బుల్లెట్ ప్రూఫ్ కార్లను సీఎం సెక్యూరిటీ, ఇంటెలిజెన్స్ వింగ్ కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఒక్కో మంత్రికి రూ.2 కోట్ల విలువచేసే కొత్త ల్యాండ్ క్రూజర్లోని ప్రాడో వెర్షన్ కార్లను కొనుగోలు చేశారని సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. మరికొంతమంది గత ప్రభుత్వం కొనుగోలు చేసిన వాటినే.. మంత్రులకు కేటాయించారని చెప్తున్నారు.
ఈ నేపథ్యంలో 2023 డిసెంబర్ 28న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మీడియాతో మాట్లాడిన మాటలను ఉటంకిస్తూ నెటిజన్లు పోస్టులు పెట్టారు. ‘పాత సీఎం కొత్తగా కాన్వాయ్‌ని సిద్ధం చేసుకున్నారు. కృష్ణా జిల్లా గన్నవరం మండలం వీరపనేనిగూడెం గ్రామంలోని మిల్లర్ త్రిహయిని ఇంజినీరింగ్ కంపెనీలో వాటిని కేసీఆర్ దాచారు. నాకు కొత్తగా కార్లకు ఖర్చు పెట్టడం ఇష్టం లేదు’ అని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పా రు. అప్పటికి ఇంకా బుల్లెట్ ప్రూఫ్ పనులు మొదలే కాలేదు.
రేవంత్‌రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే.. ఆ పనులను ఆపించి ఉండొచ్చు కదా.. తనకు అంతటి అధికారం ఉన్నా కూడా ఎందుకు ఆ పనులు ఆపించలేదని నెటిజన్లు ప్రశ్నించారు. కొత్తగా పెట్టే ఖర్చు గురించి మీడియా ముందు డైలాగులు చెప్పిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆ పని చేయలేకపోగా.. కేసీఆర్ మీద నెపం మోపి, బుల్లెట్ ప్రూఫ్ వాహనాల పనులకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారని అంటున్నారు. తనకు, తన మంత్రి వర్గానికి ఉపయోగపడతాయనే ఉద్దేశంతోనే ఆ పనులను కొనసాగించారని బీఆర్ఎస్ నాయకులు సైతం విమర్శిస్తున్నారు. ప్రస్తుతం మంత్రులకు కేటాయించినది ల్యాండ్ క్రూజర్-200 మోడల్. దీని ఎక్స్ షోరూం ధర రూ.2.10 కోట్లు ఉంటుంది. ఆన్‌రోడ్ రూ.2.50 కోట్లకుపైగా ఉంటుంది. రాజకీయ నాయకుల రక్షణార్థం దానికి బుల్లెట్ ప్రూఫ్ చేయడం వల్ల మొత్తం రూ.3 కోట్ల ఖర్చు అవుతుంది. శత్రువులు దాడులు చేస్తే.. ఈ బుల్లెట్ ప్రూఫ్ సమర్థంగా రక్షిస్తుంది.
కారు కూడా కొనుక్కొలేని పొంగులేటి లాంటి బీద మంత్రులకు కొత్త ల్యాండ్ క్రూజర్ కార్లు ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం
మంత్రులందరికీ ఒక్కో ల్యాండ్ క్రూజర్స్ వాహనాన్ని కేటాయింపు
ఇప్పటి వరకు సీఎంకు మాత్రమే ల్యాండ్ క్రూజర్ వాహనాలు.. ఇకపై మంత్రులకు కూడా ల్యాండ్ క్రూజర్ వాహనాలను సమకూర్చిన… pic.twitter.com/ytNhXkW8m3
— Telugu Scribe (@TeluguScribe) June 11, 2024