HomeTelanganaLambadi Rights Struggle Committee Demands Regularization Of Contract Employees In The Tribal Welfare Department
కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరించండి
గిరిజన సంక్షేమ శాఖలోని కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని లంబాడా హక్కుల పోరాట సమితి డిమాండ్ చేసింది. ఈ మేరకు సమితి నాయకులు శుక్రవారం గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్‌కు వినతి పత్రం ఇచ్చేందుకు వెళ్తుండగా కార్యాలయం ఎదుట పోలీసులు అడ్డుకున్నారు.
గిరిజన సంక్షేమ శాఖ కార్యాలయం ఎదుట
లంబాడా హక్కుల పోరాట సమితి ధర్నా
హైదరాబాద్, నవంబర్ 29 (నమస్తే తెలంగాణ) : గిరిజన సంక్షేమ శాఖలోని కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని లంబాడా హక్కుల పోరాట సమితి డిమాండ్ చేసింది. ఈ మేరకు సమితి నాయకులు శుక్రవారం గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్‌కు వినతి పత్రం ఇచ్చేందుకు వెళ్తుండగా కార్యాలయం ఎదుట పోలీసులు అడ్డుకున్నారు. నిరసనగా నాయకులు అక్కడే ధర్నా చేయడంతో వారిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
లంబాడా హక్కుల పోరాట సమితి జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ జాటోత్ కిషన్ నాయక్, రాష్ట్ర అధ్యక్షుడు అజ్మీరా పూల్ సింగ్ నాయక్, ఆదివాసీ హక్కుల పోరాట సమితి రాష్ట్ర ఉపాధ్యక్షుడు బచ్చల ఎర్రయ్య ఆధ్వర్యంలో వినతి పత్రం అందించారు.
అనంతరం జాటోత్ కిషన్ నాయక్ మాట్లాడుతూ గిరిజన సంక్షేమ గురుకులాల్లో 451 మంది బోధనేతర కాంట్రాక్టు ఉద్యోగులు, గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో 1,804 మంది కాంట్రాక్టు ఉపాధ్యాయులు పనిచేస్తున్నారని, దాదాపు 25 ఏండ్ల నుంచి విధులు నిర్వర్తిస్తున్నా వారిని ఇప్పటి వరకూ రెగ్యులరైజ్ చేయలేదని ఆవేదన వ్యక్తంచేశారు. వారిని క్రమబద్ధీకరించే వరకు టైం సేల్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. కాంటిజెన్సీ వరర్, దినసరి ఉద్యోగులకు వేతనాలు పెంచి ఉద్యోగ భద్రత కల్పించాలని, నాలుగో తరగతి ఉద్యోగులకు 50 లక్షల ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని, ప్రతి కుటుంబానికీ హెల్త్ కార్డు ఇవ్వాలని డిమాండ్ చేశారు.