హైదరాబాద్, నవంబర్ 19 (నమస్తే తెలంగాణ): వనపనర్తి డీఎంహెచ్‌వోగా డాక్టర్ లాలూ ప్రసాద్ నియమితులయ్యారు. ఆయన నిలోఫర్‌లో డీసీఎస్/ఆర్ఎంవోగా విధులు నిర్వర్తిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నారు. ఆయన్ను వనపర్తి ఇన్చార్జి డీఎంహెచ్‌వోగా నియమిస్తూ ప్రజారోగ్య సంచాలకుడు జీ శ్రీనివాసరావు శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు డాక్టర్ లాలూప్రసాద్ బాధ్యతలు స్వీకరించారు. అనంతరం వనపర్తి కలెక్టర్ యాస్మిన్ భాషాను మర్యాదపూర్వకంగా కలిశారు. తన సేవలను గుర్తించి పదవి ఇచ్చినందుకు సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు, జిల్లా మంత్రి నిరంజన్‌రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు.