సైదాపూర్, మే 14 : కొడుకు తిండి పెట్టడంలేదని కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం రాయికల్‌కు చెందిన లక్ష్మి ధర్నాకు దిగింది. ఆమె కథనం ప్రకారం లక్ష్మికి నలుగురు కొడుకులు ఉన్నారు. భర్త మృతిచెందగా ఆయన పేరు మీ దున్న భూమిని ఇద్దరు పెద్దవాళ్లు పట్టా చేయించుకున్నారు. లక్ష్మి పేరున ఉన్న భూమిని ఇద్దరు చిన్న కొడుకులకు పట్టాచేసింది. రెండో కొడుకు ఎనిమిదేండ్ల కిందట మృతిచెందాడు.
ఐదేండ్ల క్రితం అనారోగ్యానికి గురికాగా చిన్న కొడుకులు రూ.10 లక్షల వరకు ఖర్చు చేశారని, పెద్ద కొడుకు వారసత్వంగావచ్చిన భూమిని తీసుకుని తిండి పెట్టడంలేదని వాపోయింది. ఈ క్ర మంలో గురువారం గ్రామంలోని ధాన్యం కొనుగోలు కేం ద్రానికి పెద్దకొడుకు ధాన్యం తీసుకుపోతుండగా ట్రాక్టర్ ఎదుట ధర్నాకు దిగింది. వృద్ధాప్యంలో ఉన్న తనను ఆదుకోవాలని అధికారులను కోరింది.