తిమ్మాజిపేట, అక్టోబర్ 3 : మాజీ మంత్రి లక్ష్మారెడ్డి మాతృమూర్తి లక్ష్మమ్మ అంత్యక్రియలు శుక్రవారం అశ్రునయనాల మధ్య నాగర్‌కర్నూల్ జిల్లా తిమ్మాజిపేట మండలం ఆవంచ గ్రామంలో నిర్వహించారు.
అంత్యక్రియల్లో మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్, ఎమ్మెల్సీలు నవీన్‌కుమార్‌రెడ్డి, దామోదర్‌రెడ్డి, మాజీ ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు మర్రి జనార్దన్‌రెడ్డి, ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, రాజేందర్‌రెడ్డి, రామ్మోహన్‌రెడ్డి, అంజయ్యయాదవ్, నాయకులు తదితరులు పాల్గొన్నారు.