రోటిబండతండాలో వేరుశనగ, వరి పంటను చూపుతున్న మంజుల, పూజ
Lagacharla | ఈ ఇద్దరమ్మాయిల్లో ఒకరు మంజుల, మరొకరు పూజ.. రాష్ట్రవ్యాప్తంగా లగచర్ల ఘటన సంచలనం రేపుతుంటే ఎక్కడ చూసినా ఈ ఇద్దరి గురించే చర్చ జరుగుతున్నది. విద్యార్థి దశలోనే సాక్షాత్తు సీఎంను ఎదురిస్తున్నారు. ఫార్మా కంపెనీ మాకొద్దంటూ ఓ తండా గొంతుకై ప్రశ్నిస్తున్నారు. ఈ అమ్మాయిల ప్రశ్నలకు ఆఫీసర్లు, ఎస్టీ కమిషన్ బృందంతోపాటు రాజకీయ నేతలూ జవాబివ్వలేకపోతున్నారు. మంజుల డిగ్రీ చదువుతుండగా, పూజ ఇంటర్ పూర్తిచేసుకొని నీట్కి ప్రిపేర్ అవుతున్నది.
లగచర్ల ఘటన తర్వాత వీరిద్దరూ రోటిబండతండాలో గ్రామస్తులతో గళం కలిపి ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. తండాకు వచ్చే ప్రతి ఒక్కరిని ఫార్మాపై నిలదీస్తూ గ్రామస్తుల గొంతుకయ్యారు. సీఎంను, ఆయన అన్న తిరుపతిరెడ్డిని కడిగిపారేస్తున్నారు. మా ప్రాణాలు పోయినా లెక్కచేయం.. మా సమాధులపై శంకుస్థాపనలు చేసుకోండి అంటూ ఖరాఖండిగా చెబుతున్నారు. తల్లిదండ్రులు పడుతున్న కష్టాలకు చదువుకునే వయసులోనే సమాధానంగా నిలుస్తున్నారు. హ్యాట్సాఫ్ మంజుల, పూజ.
పులిచర్లకుంటలో రైతులు సాగు చేస్తున్న వేరుశనగ పంట
పులిచర్లకుంటలో రైతులు సాగు చేస్తున్న వరి పంట
రోటిబండతండాలో కోతకు వచ్చిన వరిపైరును చూపుతున్న మహిళా రైతు
లగచర్లలో పత్తిని ఏరుతున్న రైతులు, కూలీలు
రోటిబండతండాలో సాగవుతున్న వేరుశనగ పంటను చూపుతున్న మహిళా రైతు
పులిచర్లకుంటలో సాగవుతున్న పంటలకు బోరుబావి నుంచి వెళ్తున్న నీరు