KTR | కేటీఆర్‌కు రాఖీ కట్టిన లగచర్ల ఆడబిడ్డ జ్యోతి
భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు (KTR) కొడంగల్ నుంచి వచ్చిన గిరిజన సోదరీమణులు రాఖీ కట్టి తమ కృతజ్ఞతను చాటుకున్నారు. ప్రభుత్వం తమ జీవితాలను, జీవనాధారమైన వ్యవసాయ భూములను లాక్కున్నప్పుడు, తమకు ఒక అన్నలా అండగా నిలిచిన కేటీఆర్‌కు రాఖీ కట్టామని వారు తెలిపారు.
హైదరాబాద్: భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు (KTR) కొడంగల్ నుంచి వచ్చిన గిరిజన సోదరీమణులు రాఖీ కట్టి తమ కృతజ్ఞతను చాటుకున్నారు. ప్రభుత్వం తమ జీవితాలను, జీవనాధారమైన వ్యవసాయ భూములను లాక్కున్నప్పుడు, తమకు ఒక అన్నలా అండగా నిలిచిన కేటీఆర్‌కు రాఖీ కట్టామని వారు తెలిపారు. కొడంగల్ మండలం లగచర్ల గ్రామం రోటిబండ తండాకు చెందిన జ్యోతి, మరికొంతమంది మహిళలు కేటీఆర్ నివాసానికి వెళ్లి రాఖీ కట్టారు. లగచర్ల భూ పోరాటం సమయంలో నిండు గర్భిణిగా ఉన్న జ్యోతిపై రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, పోలీసులు దౌర్జన్యం చేశారని, ఆమె భర్తను జైలుకు పంపిన, సమయంలో కేటీఆర్ ఢిల్లీ వెళ్లి పలు కమిషన్లకు ఫిర్యాదులు చేసి, జ్యోతితో పాటు లగచర్ల గిరిజనులకు, పేద రైతన్నలకు జరుగుతున్న అన్యాయాన్ని ఢిల్లీ వేదికగా ఎండగట్టారు. దీని ఫలితంగా, ప్రభుత్వం భూసేకరణను వెనక్కి తీసుకుందని వారు తెలిపారు. కేసుల కారణంగా జైలుపాలైన లగచర్ల సోదర సోదరీమణులందరికీ కేటీఆర్ అన్నగా అండగా నిలబడి, న్యాయ సహాయం అందించారని, అందరినీ జైలు నుంచి విడిపించారని వారు తెలియజేశారు.
రాఖీ కట్టిన సందర్భంగా జ్యోతి తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ‘ప్రభుత్వం మా భూములు లాక్కొని అన్ని వైపుల నుంచి దాడులు చేసి, మా కుటుంబ సభ్యులను జైల్లో పెడితే, నిండు గర్భిణిగా ఉన్న నాకు కేటీఆర్ అన్న అండగా నిలబడ్డారు. దగ్గరుండి నా బాగోగులు చూసుకున్నారు. నా ఆరోగ్యంతో పాటు నా ప్రసవం వరకు, నా బిడ్డ ‘భూమి నాయక్’ యోగక్షేమాల కోసం ఒక సొంత సోదరుడిలా అన్ని బాధ్యతలు తీసుకున్నారు’ అని జ్యోతి కన్నీళ్లు పెట్టుకున్నారు. కేటీఆర్ మేనమామలా తన బిడ్డకు పేరు పెట్టారని జ్యోతి సంతోషం వ్యక్తం చేశారు. కేటీఆర్ తనకు దేవుడు ఇచ్చిన సోదరుడని ఆమె అన్నారు. కేవలం తమకు మాత్రమే కాకుండా, రాష్ట్రంలో ఆపదలో ఉన్న ప్రతి ఒక్కరికీ ఆయన అన్నలా ఆదుకుంటారని, అలాంటి కేటీఆర్‌కు, ఈరోజు ఆయన ఇంటికి వచ్చి రాఖీ కట్టడం తమకు చాలా సంతోషంగా ఉందని జ్యోతి తెలిపింది.
✳️ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS గారికి రాఖీ కట్టిన లగచర్ల ఆడబిడ్డ జ్యోతి మరియు లగచర్ల గిరిజన సోదరీమణులు
✳️ ప్రభుత్వం మా భూములు గుంజుకొని మా భర్తను జైలుకు పంపి అన్ని వైపులా దాడులు చేస్తుంటే కేటీఆర్ అన్న లెక్క నిలబడ్డాడు
✳️ నిండు గర్భిణిగా ఉన్న నా క్షేమాలన్నీ… pic.twitter.com/QAQGChClKr
— BRS Party (@BRSparty) August 8, 2025
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Prince William: ప్రిన్స్ విలియమ్‌తో కలిసి క్రికెట్ ఆడిన గంగూలీ, రహానే
‘ఉప సర్పంచుల చెక్ పవర్‌పై ఆంక్షలు ఎత్తివేయాలి’
Actor Brahmaji | ‘ప్రొటెస్ట్ అనేది కొత్త వృత్తి’.. నటుడు బ్రహ్మాజీ వివాదాస్పద పోస్ట్.. నెటిజన్ల ఆగ్రహం!
రైతులకు నాణ్యమైన విద్యుత్ అందించాలి : మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్
Harish Rao | హరీష్‌రావుకు గద్వాల బీఆర్ఎస్ నాయకుల ఘనస్వాగతం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

