ఫార్మా వ్యతిరేక పోరాటంలో 37 రోజులు జైల్లో ఉండి, శుక్రవారం విడుదలైన లగచర్ల రైతు.. నిండు గర్భిణి అయిన తన భార్య జ్యోతిని చూసి ఉద్వేగానికి లోనైన దృశ్యం
‘కొడుకా మీరు మల్లొస్తరని అనుకోలే.. మిమ్మల్ని మల్లా సూత్తననుకోలే.. మాయదారోళ్లు మిమ్మల్ని తీస్కవొయి మమ్మల్ని ఆగం జేసిండ్రు. మిమ్ములను ఏం జేస్తరేమోనని బుగులైంది కొడుకా.. పానం అరచేతిల వెట్టుకొని బతికినం నాయనా…! ’ సంగారెడ్డి జిల్లా కంది జైలు నుంచి విడుదలై లగచర్లకు వచ్చిన రైతులను పట్టుకొని ఏడుస్తున్న తల్లులు.
‘బిడ్డలారా.. మిమ్మల్ని మల్ల చూస్తననుకోలే.. ఇన్నాళ్లూ దినమొక గండంగా గడిచింది. మీరు ఎట్లున్నరోనని ఏడ్వని రోజులేదు..’ లగచర్ల ఘటనలో జైలుకు వెళ్లి తిరిగి ఇంటికి వచ్చిన అనంతరం కుమార్తెలను పట్టుకొని రోదిస్తున్న రైతు.
కంది జైలు నుంచి రైతులు విడుదల కావడంతో హర్షం వ్యక్తంచేస్తూ నినాదాలు చేస్తున్న లగచర్ల, పులిచర్లకుంటతండా, రోటిబండతండా గ్రామస్తులు
జైలు నుంచి విడుదలైన అనంతరం నినాదాలు చేస్తున్న లగచర్ల, పులిచర్లకుంటతండా, రోటిబండతండా రైతులు
‘బావ.. మన బిడ్డ భూమ్మీదకు వచ్చేలోపు నిన్ను బయటికి తేవాల్నని ఎక్కని మెట్లు లెవ్వు.. ఎవరెంత భయపెట్టినా బుగులువట్టలే… అన్న కేటీఆర్‌ను కలిసిన..మాటిచ్చిండు..నిన్ను బయటికి తెచ్చిండు.’ జైలు నుంచి విడుదలై ఇంటికొచ్చిన పులిచెర్లకుంటతండా యువరైతు ప్రవీణ్‌కు అన్నం తినిపిస్తున్న భార్య జ్యోతి
‘బిడ్డా ఎన్నిదినాలయేరా.. నువ్వు సక్కంగ బువ్వ తిని.. గా జైలులో కడుపు నిండ తిన్నవో లేదోనని నీ పిచ్చితల్లి ఏడ్వని దినం లేదు.. నువ్వు ఎప్పుడొస్తవని కనిపించిన మనిషినల్లా అడిగిన.. నువ్వు వచ్చే వరకు ఎట్ల గడిచినయో ఈ పాడు రోజులు.’ జైలు నుంచి విడుదలై ఇంటికి చేరుకున్న రోటిబండతండా రైతుకు అన్నం తినిపిస్తున్న తల్లి
‘నాన్నా..ఎట్లున్నవే..నిన్ను జైల్లో పెట్టిననుంచి మాకు భయమైంది. నిన్ను ఏం చేస్తారేమోనని టెన్షన్ పడ్డ. నువ్వు జైల్లో ఉన్నన్ని రోజులు పాణమంతా నీ దిక్కే కొట్టుకున్నది. గీ మాయదారి సర్కారోళ్లు ఏం జేస్తరోనని బుగులైంది..నాన్నా..’ – సంగారెడ్డి జిల్లా కంది జైలు వద్ద విడుదలైన తండ్రిని పట్టుకొని ఏడుస్తున్న కూతురు
రైతులను అక్రమ కేసుల్లో ఇరికించి, జైలులో పెట్టడం అన్యాయం. సీఎం రేవంత్‌రెడ్డి ఉద్దేశపూర్వకంగా రైతులను జైలుపాలు చేశారు. బీఆర్ఎస్ న్యాయపోరాటం ఫలితంగా 17 మంది రైతులకు బెయిల్ వచ్చింది. మిగతా రైతులకు కూడా బెయిల్ వచ్చేలా న్యాయపోరాటం చేస్తాం. రైతులపై ప్రభుత్వం అక్రమంగా బనాయించిన కేసులను ఎత్తివేయాలి. రైతుల పక్షాన పోరాటం కొనసాగుతుంది.
లగచర్ల ఘటనలో నేను దాడికి పాల్పడలే దు. కానీ నన్ను అరెస్టు చేసి చిత్రహింసలకు గురిచేశారు. నా భార్య గర్భవతి. ఆమెను చూసుకునేందుకు ఎవరూ లేరని వేడుకున్నా కనికరించలేదు. పోలీసులు కొట్టిన దెబ్బలకు 4 రోజులు నడవలేకపోయా ను. నా కు టుంబానికి కేటీఆర్ అం డగా నిలిచారు. నా భార్యకు మెరుగైన వైద్యం అందేలా చూ శారు.
లగచర్ల ఘటనాస్థలంలో నేను లేకపోయినా పోలీసులు అ రెస్టు చేశారు. పొలం పను లు చేసుకొని ఇంటికొచ్చి నిద్రిస్తు న్న నన్ను డోర్లుకొట్టి లేపారు. అక్రమంగా అరెస్టు చేసి హింసించారు. జైలులో ప్రతీరోజు గండంలా గడిపాను. కాంగ్రెస్ ప్రభుత్వానికి మా ఉసురు తగులుతుంది. అక్రమ కేసులు ఎత్తివేయాలి.
రైతులపై రేవంత్ సర్కార్ అక్రమంగా కేసులు బనాయించింది. కేటీఆర్ సూచన మేరకు బీఆర్ఎస్ లీగల్‌సెల్ రైతుల పక్షాన న్యాయపోరాటం చేసింది. రైతుల కోసం బీఆర్ఎస్ పోరాటం కొనసాగుతుంది. రైతులను ఇబ్బందులకు గురిచేయాలని చూస్తే సహించేదిలేదు.
అర ఎక రం భూమి అమ్మి ఇల్లు కట్టుకున్నా. ఫార్మా కంపెనీకి భూమి ఇవ్వమంటే ఎలా ఇస్తాం. ప్రాణాలు పోయినా సరే మా భూములు ఇయ్యం. గుండెనొప్పి ఉందని చెప్పినా పట్టించుకోలేదు. కంది జైల్లో గుండెనొప్పి వస్తే బేడీలు వేసి దవాఖానకు తీసుకెళ్లారు. తీవ్ర ఆవేదనతో చచ్చి బతికా. అక్రమ కేసులను ఎత్తివేయాలి.
లగచర్ల ఘటనకు నాకు ఎలాంటి సంబంధం లేదు. నన్ను ఎందుకు అరెస్టు చేశారో ఇప్పటికీ అర్థం కావడం లేదు. ఘటన జరిగిన రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు నా కోళ్లఫారంలో పని చేసుకుంటూనే ఉన్నా. మా కుటుంబాన్ని రోడ్డుపైకి తీసుకొచ్చి అన్యాయం చేశారు.
ఉపాధి కోసం ముంబయిలో పని చేసుకుంటూ ఇటీవలే ఇంటికి వచ్చాను. అసలు కేసు ఏమిటో కూడా నాకు తెలియదు. పోలీసులు నన్ను ఇంటి నుంచి తీసుకెళ్లారు. జైల్లో పెట్టి నా పొట్టమీద కొట్టారు. తీవ్ర మానసిన ఆందోళనకు గురిచేశారు.