జగిత్యాల, సెప్టెంబర్ 16: దవాఖాన అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా రోగుల కు అందించిన అల్పాహారంలో లక్క పురుగు లు బయటపడ్డాయి. ఈ ఘటన సోమవారం జగిత్యాల మాతాశిశు కేంద్రంలో వెలుగుచూసింది. జగిత్యాలలోని ఎంసీహెచ్‌కు రోగుల తాకిడి ఎక్కువ. నిత్యం 100 మందికి పైగా బా లింతలు, వారి సహాయకులతో కిటకిటలాడుతది. ఇందులో ఇన్పేషెంట్లుగా చేరిన వారికి, వారి సహాయకులకు రోజూ పాలు, బ్రెడ్, అల్పాహారం, మధ్యాహ్నం భోజనం అందిస్తా రు. రోజు మాదిరిగానే.. ఉదయం అటుకుల అల్పాహారం ఇవ్వడంతో అందులో లక్కపురుగులు కనిపించాయి. దీంతో రోగులు ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘మరీ ఇంత అధ్వానమా? దీని ని ఎలా తినాలి? అని మండిపడ్డారు. నాలుగు రోజులుగా నాసిరకం అల్పాహారం, ఉడికీఉడకని అన్నం అందిస్తున్నారని, తినలేకపోతున్నామని, ఒకవేళ తింటే వాంతులు, విరేచనాలు అవుతున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. పురుగుల టిఫిన్ పెట్టి రోగుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని? మీడియాకు సమాచారం అందించారు. సదరు కాంట్రాక్టరుకు ‘నమస్తే తెలంగాణ’ ఫోన్ చేయగా స్పందించలేదు.
లోయర్ మానేరు జలాశయంలో కరీంనగ ర్ జిల్లా తిమ్మాపూర్ మండలం ఇందిరానగర్ పరిధి సంగెంపల్లికి చెందిన మత్స్యకారుడు తిరుపతి వలకు 30 కిలోల భారీ చేప చిక్కింది. రోజులాగే సోమవారం చేపల వేటకు వెళ్లిన తిరుపతి.. తన వలల ను తీస్తుండగా భారీ చేప కనిపించడంతో తిరుపతి ఆనందం వ్యక్తం చేశాడు. ఈ చేపను రామకృష్ణ కాలనీలో రూ.5 వేలకు విక్రయించాడు. -తిమ్మపూర్