హైదరాబాద్, జూన్ 25 (నమస్తే తెలంగాణ) : మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం(ఎంజీఎన్ఆర్ఈజీఏ) స్థానంలో వీబీ-జీఆర్‌ఏఎంజీ పథకాన్ని ప్రతిపాదించడాన్ని వ్యతిరేకిస్తూ, గ్రామీణ కుటుంబాల పని హకును రక్షించాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం, సీఐటీయూ డిమాండ్ చేశాయి.
కేంద్రప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా జూలై 1న దేశవ్యాప్త నిరసనల్లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు తెలుపాలని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్, తెలంగాణ రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తీగల సాగర్, అధ్యక్షుడు ఆర్ వెంకట్రాములు పిలుపునిచ్చారు. గురువారం ఆర్టీసీ క్రాస్‌రోడ్‌లోని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కార్యాలయంలో వాల్ పోస్టర్లు ఆవిష్కరించి మాట్లాడారు. దశాబ్దాల పోరాటంతో సాధించుకున్న ఉపాధి హామీ నుంచి, ప్రతిపాదిత ఎంజీఎన్ఆర్ఈజీఏ స్థానంలో కొత్త పథకాన్ని తీసుకురావడం పెద్ద తప్పిదం అవుతుందని పేర్కొన్నారు.