పెన్నా నీళ్లు చాలడం లేదు.. అందుకే కృష్ణా జలాలు తరలించుకుంటున్నాం..ట్రిబ్యునల్ విచారణలో ఏపీ సర్కార్ వాదనలు
పెన్నా బేసిన్ నీటితో హంద్రీనీవా, గాలేరు-నగరి సుజల స్ర వంతి, తెలుగుగంగ ప్రాజెక్టులను నిర్వహించుకోలేమని, అందుకే కృష్ణా జలాలను తరలించుకుంటున్నామని ఏపీ సర్కార్ వెల్లడించింది. బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్ ఎదుట వాదనలు వినిపించింది.
హైదరాబాద్, జూలై 23 (నమస్తే తెలంగాణ) : పెన్నా బేసిన్ నీటితో హంద్రీనీవా, గాలేరు-నగరి సుజల స్రవంతి, తెలుగుగంగ ప్రాజెక్టులను నిర్వహించుకోలేమని, అందుకే కృష్ణా జలాలను తరలించుకుంటున్నామని ఏపీ సర్కార్ వెల్లడించింది. బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్ ఎదుట వాదనలు వినిపించింది. కేంద్రం జారీచేసిన సెక్షన్ 3 మార్గదర్శకాల మేరకు ఇరు రాష్ర్టాల మధ్య కృష్ణాజలాల పునఃపంపిణీకి సంబంధించి ఢిల్లీలో ఈ ట్రిబ్యునల్ చేపట్టిన విచారణ గురువారం సైతం కొనసాగింది. శ్రీశైలం, నాగార్జునసాగర్ రిజర్వాయర్లలో క్యారీ ఓవర్ స్టోరేజీ నీటివినియోగం ఆధారంగానే తమకు 76%, తెలంగాణకు 24% నిష్పత్తిలో పంపిణీ చేయాలని ఏపీ ప్రతిపాదించింది.
తెలంగాణ సైతం ఆర్డీఎస్ దగ్గర వాడుకోలేని నీళ్లను తుమ్మిళ్ల దగ్గర వాడుతున్నదని తెలిపింది. ఆర్డీఎస్ రైట్ కెనాల్‌కు కేడబ్ల్యూడీటీ-2 అనుమతులిచ్చిందని, తద్వారా తుంగభద్ర రైట్ బ్యాంక్ లోలెవెల్ కెనాల్ కింద కవర్ కాని ఏరియాలకు నీళ్లిస్తామని వెల్లడించింది. ఆర్డీఎస్ను కృష్ణా బోర్డే పర్యవేక్షిస్తున్నదని, కమిటీలు కూడా వేశారని, 16వ బోర్డు మీటింగ్ మినట్స్ రికార్డయ్యాయని పేర్కొన్నది. ఆర్డీఎస్ ఆనకట్ట ఎత్తు పెంచాలని నిపుణుల కమిటీ చెప్పలేదని, కేవలం ఆ అంశాన్ని పరిశీలించమని మాత్రమే సూచించిందని తెలిపింది. ఈ వాదనలు శుక్రవారం కూడా కొనసాగనున్నాయి.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vice President | శ్రీవారిని దర్శించుకున్న భారత ఉప రాష్ట్రపతి
లక్ష్మీపురంలో గ్రామ మహిళా సంఘ భవనం ప్రారంభం
Jobs | డిగ్రీ అర్హతతో రైల్వేలో 1250 స్టేషన్ మాస్టర్ పోస్టులు.. నవంబర్ 25 చివరితేదీ
Boy Fakes Kidnap | తండ్రి నుంచి రూ.5 లక్షలు వసూలు చేసేందుకు.. కిడ్నాప్ నాటకం ఆడిన యువకుడు
కోట మైసమ్మ జాతర ఆదాయం రూ.32,02,697
ట్రెండింగ్ వార్తలు
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?

