కేంద్రానికి వినోద్‌కుమార్ డిమాండ్
హైదరాబాద్, మే 1 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్‌లో ఉమ్మడిగా ఉన్న పారిశ్రామిక ట్రిబ్యునల్ కం లేబర్ కోర్టును తక్షణమే విభజించాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం మే డే సందర్భంగా పలు కార్మిక సంఘాల నాయకులు, ప్రతినిధులు మంత్రుల నివాసంలో వినోద్‌కుమార్‌తో సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ, ఏపీ రాష్ట్రాల విభజన జరిగి ఎనిమిదేండ్లు పూర్తి కావస్తున్నా ఇంకా పారిశ్రామిక ట్రిబ్యునల్ కం లేబర్ కోర్టును విభజించకపోవడం వల్ల రాష్ట్ర కార్మికులు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. రెండు రాష్ట్రాలకు వేర్వేరుగా పారిశ్రామిక ట్రిబ్యునల్ కం లేబర్ కోర్టు ఉంటే కార్మికుల సమస్యలు, కోర్టు కేసులు త్వరగా పరిషారం అయ్యేందుకు అవకాశం ఉంటుందని చెప్పారు.