హైదరాబాద్, నవంబర్ 17(నమస్తే తెలంగాణ): ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్-2 పోస్టుల ఫలితాలను సోమవారం మంత్రి దామోదర రాజనర్సింహ విడుదల చేశారు. 1,284 పోస్టులకు గతేడాది నోటిఫికేషన్ విడుదల చేసి దరఖాస్తులు స్వీకరించారు.
డిజిటల్ వర్సిటీగా బీఆర్ అంబేద్కర్ విశ్వవిద్యాలయం
హైదరాబాద్, నవంబర్ 17 (నమస్తే తెలంగాణ): దూరవిద్యలో యావత్ దేశానికే ఆదర్శంగా నిలిచిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం డిజిటల్ వర్సిటీగా రూపాంతరం చెందనుంది. కామన్వెల్త్ ఆఫ్ లెర్నింగ్‌తో మంగళవారం ఒప్పందం కుదుర్చుకోనుంది. సీఎం రేవంత్ సమక్షంలో వీసీ చక్రపాణి, కామన్వెల్త్ ఆఫ్ లెర్నింగ్ సీఈవో పీటర్ స్కాట్ ఒప్పంద పత్రాలను మార్చుకోనున్నారు.
25నుంచి 30వ తేదీ మధ్యలో మిడ్లైన్ టెస్ట్
హైదరాబాద్, నవంబర్ 17(నమస్తే తెలంగాణ): పాఠశాలల్లోని విద్యార్థులకు ఈ నెల 25 నుంచి 30 వరకు లెర్నింగ్ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రాం(లిప్), ఫౌండేషన్ న్యూమరసీ అండ్ లిట్రరసీ(ఎఫ్ఎల్ఎన్) మిడ్లైన్ టెస్ట్ నిర్వహించనున్నారు.