హైదరాబాద్ : కరీంనగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఎల్. రమణ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పాల్గొన్నారు. గురువారం తెలంగాణ శాసన మండలి చైర్మన్ చాంబర్లో మండలి ప్రొటెం చైర్మన్ అమిణుల్ హాసన్ జాఫ్రి ఎల్.రమణతో ప్రమాణ స్వీకారం చేయించారు.
ఈ సందర్భంగా ఎల్.రమణకు ఎమ్మెల్సీ కవిత శుభాకాంక్షలు తెలియజేశారు. కాగా, అంతకు ముందు పట్నం మహేందర్రెడ్డి, వంటేరు యాదవ రెడ్డి ఎమ్మెల్సీలుగా ప్రమాణ స్వీకారం చేశారు.
యాదవరెడ్డి ప్రమాణ స్వీకారానికి మంత్రులు హరీశ్ రావు, ప్రశాంత్ రెడ్డి, మహమూద్ అలీ, ఎమ్మెల్యేలు, ఇతర నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ యాదవ రెడ్డికి మంత్రి హరీశ్ రావు పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.