భక్త జనసంద్రమైన కురుమూర్తి.. ఘనంగా ఉద్దాల ఉత్సవం
Kurumurthy Jathara | జిల్లా పరిధిలోని చిన్న చింతకుంట మండలంలోని పేదల తిరుపతి శ్రీశ్రీశ్రీ కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ప్రధాన ఘటమైన ఉద్దాల మహోత్సవం ఘనంగా ప్రారంభమైంది.
మహబూబ్ నగర్ : జిల్లా పరిధిలోని చిన్న చింతకుంట మండలంలోని పేదల తిరుపతి శ్రీశ్రీశ్రీ కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ప్రధాన ఘటమైన ఉద్దాల మహోత్సవం ఘనంగా ప్రారంభమైంది. పల్లమర్రి గ్రామం నుండి ఉద్దాల్ ( చాట ) బయలుదేరి నెల్లికోండి గ్రామం మీదుగా వడ్డేమాన్ గ్రామానికి చేరుకున్నాయి. అక్కడ ప్రత్యేక పూజల అనంతరం అక్కడ్నుంచి ఊకచెట్టు వాగుపై తిర్మలాపూర్ గ్రామం మీదుగా శ్రీశ్రీశ్రీ కురుమూర్తి స్వామి జాతర మైదానానికి సాయంత్రం వరకు చేరుకుంటాయి.

ఈ ఉత్సవాలను చూడటానికి భక్తులు పెద్ద ఎత్తున చేరుకుంటారు. దారి పొడువునా ఆయా గ్రామాల్లో భక్తులు దర్శించుకుని ఊరేగింపులో పాల్గొంటారు. ఆలయం వద్దకు చేరుకోగానే ప్రత్యేక పూజల అనంతరం ఉద్దాలను గుట్టపైకి తీసుకెళ్తారు. భక్తుల సందర్శనార్థం అక్కడ ఉంచుతారు.
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి, జడ్పీ చైర్మన్ స్వర్ణసుధాకర్ రెడ్డి, మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి, అధికారులు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
జాతర సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మహబూబ్ నగర్, నారాయణపేట డిపోల నుంచి ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఎన్సీడబ్ల్యూఏ ఉద్యోగులకు క్వార్టర్స్ కేటాయింపు
Karikaala | ‘కరికాల’ నా కెరీర్ బెస్ట్ మూవీ అవుతుంది.. పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన సందీప్ కిషన్ పాన్-ఇండియా చిత్రం
‘విద్యుత్ భద్రతలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు’
అనధికారిక యూటర్న్తో ప్రమాదాలు
Rajnath Singh | ఈసారి తీవ్రవాద దాడి జరిగితే తీవ్రంగా స్పందిస్తాం.. పాకిస్తాన్కు రాజ్నాథ్ సింగ్ హెచ్చరిక
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

