హైదరాబాద్, మార్చి 8 (నమస్తే తెలంగాణ): జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజనతో దక్షిణాది రాష్ర్టాలకు తీరని అన్యాయం జరుగుతుందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఆందోళన వ్యక్తంచేశారు. కేంద్రం నష్టపోయే రాష్ర్టాలకు తగిన రక్షణ కల్పించకుంటే తిరుగుబాటు తప్పదని హెచ్చరించారు.
శనివారం ముగ్దూంభవన్లో ‘నియోజకవర్గాల పునర్విభజన-దక్షిణాది రాష్ర్టాలపై ప్రభావం’ అనే అంశంపై నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రాజ్యసభకు లోక్‌సభతో సమానంగా అధికారాలు కల్పించాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ప్రొఫెసర్ హరగోపాల్, కే శ్రీనివాస్, జస్టిస్ చంద్రకుమార్ తమ అభిప్రాయాలు తెలిపారు.