హైదరాబాద్, మార్చి 13 (నమస్తే తెలంగాణ ) : రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి మంత్రులెవ్వరూ హోంవర్క్ చేయడంలేదని, ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ఫెయిలయ్యారని శాసనసభలో సీపీఐ పక్షనేత కూనంనేని సాంబశివరావు అన్నారు. గురువారం ఆయన అసెంబ్లీలో మాట్లాడుతూ.. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ సమగ్రంగా అమలు చేయాలని కోరారు. కేంద్రం నుంచి నిధులు రాబట్టడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలం చెందిందని విమర్శించారు. ఒకవైపు కేంద్రం నుంచి ఏపీ నిధులు రాబట్టుకుంటుంటే.. తెలంగాణ సర్కారు ఏం చేస్తున్నదని ప్రశ్నించారు. పోలవరానికి జాతీయ హోదా ఇవ్వడంతోపాటు విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని కూడా టేకప్ చేశారని, కానీ బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ మీద కేంద్రానికి పట్టింపే లేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. పార్లమెంట్ డీలిమిటేషన్‌తో దక్షిణాది రాష్ర్టాలకు అన్యాయం జరిగే ప్రమాదం ఉందని అభిప్రాయం వ్యక్తంచేశారు. ఈక్రమంలోనే దక్షిణాది రాష్ర్టాలన్నీ ఒక సమాఖ్యగా ఏర్పాటు కాబోతున్నాయని ఆయన స్పష్టంచేశారు. ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జే మదన్మోహన్రావు మాట్లాడుతూ.. అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ ప్రతి జిల్లాకు వస్తుందని తెలిపారు. వైఎస్సార్‌తోనే తెలంగాణ అభివృద్ధి చెందిందని గుర్తుచేశారు. గ్లోబల్ కెపాబులిటీ సెంటర్, సెమికండక్టర్ వంటి పరిశ్రమలు త్వరలో రాబోతున్నాయని ఆయన స్పష్టం చేశారు..
హైదరాబాద్, మార్చి 13 (నమస్తే తెలంగాణ): గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే చర్చ సందర్భంగా శాసన మండలిలో రేషన్‌కార్డులపై వాడీవేడిగా చర్చ జరిగింది. కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ప్రభు త్వం పేదలు, సబ్బండ వర్గాలకు ఏమీ చేయలేదని పదేపదే మాట్లాడటంతో మండలిలో ప్రతిపక్షనేత మధుసూదనాచారి కలుగజేసుకున్నారు.
‘జీవన్రెడ్డిగారు తమ ప్రభుత్వం గురించి చెప్పుకోవడంలో తప్పు లేదు. కానీ అదేపనిగా బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఏమీ జరగలేదని చెప్పడాన్ని సహించేది లేదు. మా ప్రభుత్వ హయాంలో ఒక్క రేషన్‌కార్డు కూడా ఇవ్వలేదని కాంగ్రెస్ వాళ్లు అంటున్నారు.. అది వాస్తవమని నిరూపిస్తే.. సభ చైర్మన్‌గా మీరు ఎటువంటి శిక్ష విధించినా దానిని స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాం’ అని చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డిని కోరారు. ‘