సారంపల్లి మల్లారెడ్డి మృతి పట్ల కమ్యూనిస్ట్ నాయకుల సంతాపం
సీపీఎం సీనియర్ నాయకులు, అఖిల భారత రైతు సంఘం నాయకులు సారంపల్లి మల్లారెడ్డి మృతి పట్ల కమ్యూనిస్ట్ లీడర్లు సంతాపం తెలిపారు
హైదరాబాద్: సీపీఎం సీనియర్ నాయకులు, అఖిల భారత రైతు సంఘం నాయకులు సారంపల్లి మల్లారెడ్డి మృతి పట్ల కమ్యూనిస్ట్ లీడర్లు సంతాపం తెలిపారు. సారంపల్లి మల్లారెడ్డి గారి మృతి రైతాంగ ఉద్యమానికి, ప్రజా ఉద్యమాలకు తీరని లోటని సీపీఐ నెల్లికంటి సత్యం తెలిపారు. వ్యవసాయ రంగం, ఆర్థిక వ్యవస్థ, సాగునీటి ప్రాజెక్టులపై మల్లారెడ్డి గారికి ఉన్న విశేషమైన అనుభవం, అవగాహన ఎంతో గొప్పవని అన్నారు. రైతుల సమస్యల పరిష్కారం కోసం ఆయన చేసిన కృషి చిరస్మరణీయమని కొనియాడారు.
ప్రజా, రైతాంగ సమస్యలపై నిబద్ధతతో పనిచేసిన మల్లారెడ్డి గారి సేవలు ఎల్లప్పుడూ స్ఫూర్తిదాయకంగా నిలుస్తాయని తెలిపారు. ఆయన కుటుంబ సభ్యులకు, సహచరులకు, అభిమానులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, వారి కుటుంబానికి మనోధైర్యం కలగాలని నెల్లికంటి సత్యం ఆకాంక్షించారు.
కూనంనేని సంతాపం.
సారంపల్లి మల్లారెడ్డి మృతి పట్ల సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు సంతాపం తెలిపారు. మల్లారెడ్డికి అన్ని అంశాలపై పట్టు ఉన్న మేధావి అని, ముఖ్యంగా వ్యవసాయం, సాగునీటి ప్రాజెక్టులపై తనకు పూర్తి అవగాహన ఉన్నదన్నారు. ఆయన నిబద్ధత గల కమ్యూనిస్టు నాయకులని వారన్నారు. వారి మరణం కమ్యూనిస్టు ఉద్యమానికి, రైతాంగ ఉద్యమానికి తీరని లోటన్నారు. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నప్పుడు నాకు గాని, జూలకంటి రంగారెడ్డికి గాని, కమ్యూనిస్టులు ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు తన సూచనలు, సలహాలు ఎంతగానో ఉపయోగపడేవని వారన్నారు. ఆయన మరణం పట్ల సంతాపాన్ని, వారి కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ranabaali | రణబాలి ట్విట్టర్ రివ్యూ.. విజయ్ దేవరకొండ నటనకు ప్రశంసలు, కథనంపై మిశ్రమ స్పందన!
Bigg Boss 10 | బిగ్బాస్లో షాలిని, రోహిత్ మధ్య బ్రేకప్ వార్.. టాస్క్లో ఓటమితో వంశీ కన్నీళ్లు!
Caller ID | కాలర్ పేరు ప్రదర్శించడం తప్పనిసరి.. టెలికం కంపెనీలకు కేంద్రం ఆదేశం
Paper Leak | 8 ఏండ్లుగా పేపర్ లీక్లే లేవట.. NTAపై కేంద్ర విద్యా శాఖ నివేదిక
Reservations | మతం మారితే రిజర్వేషన్ వర్తించదు.. సుప్రీంకోర్టు కీలక తీర్పు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

