హైదరాబాద్ సిటీబ్యూరో, ఫిబ్రవరి 17 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్లోని పారిజాత హోమ్ అండ్ డెవలపర్స్ సంస్థకు ఓ మార్కెటింగ్ టీమ్ కుచ్చుటోపీ పెట్టింది.
వెంచర్లలోని ప్లాట్ల అమ్మకం ద్వారా కస్టమర్ల నుంచి ఆ సంస్థకు రావాల్సిన సొమ్మును మార్కెటింగ్ టీమ్ సభ్యులు తమ సొంత ఖాతాల్లో జమ చేసుకొని రూ.80 కోట్లకు మోసగించారు. దీనిపై పారిజాత సంస్థ సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితుడు వెంకట సుబ్రమణ్యం, అతని అనుచరులపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.