
యాదాద్రి: గురుపూజ దినోత్సవం సందర్భంగా ఆదివారం హైదరాబాద్లోని రవీంద్రభారతిలో ఏర్పాటు చేసిన రాష్ట్ర స్థాయి గురు పూజోత్సవంలో యాదగిరిగుట్టకు చెందిన యాదాద్రి కూచిపూడి నృత్య కళాశాలకు చెందిన విద్యార్థినులు నృత్య ప్రదర్శన చేశారు.
ఈ సందర్భంగా విద్యార్థినులను రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి శాలువతో ఘనంగా సన్మానించారు. నృత్య ప్రదర్శనలో మిర్యాల నిఖిల, లింగాల ప్రనూ తి, గుండ్లపల్లి అశ్విని, సిరివల్లి, బృంద, రుతిక, నిహారిక, మాస్టర్ రమేశ్ రాజా తదితరులు పాల్గొన్నారు.