హనుమకొండ చౌరస్తా, జూన్ 3: కాకతీయ విశ్వవిద్యాలయంలోని జియాలజీ విభాగం-బౌర్న్టెక్ సొల్యూషన్స్ ప్రైవేటు లిమిటెడ్ హైదరాబాద్ (యూఎస్ఏ బేస్డ్) కంపెనీ మధ్య పరస్పర అవగాహన అంగీకార ఒప్పందం కుదుర్చుకున్నారు.
హైదరాబాద్‌లోని సచివాలయంలో సోమవారం ఇన్చార్జి వైస్ చాన్స్‌లర్ వాకాటి కరుణ ఆధ్వర్యంలో రిజిస్ట్రార్ ప్రొఫెసర్ పీ మల్లారెడ్డి, బౌర్న్టెక్ సీజీవో జీ యుగంధర్‌రెడ్డి పరస్పర అంగీకార పత్రాలపై సంతకాలు చేశారు. జియాలజీ విగాధిపతి ప్రొఫెసర్ ఆర్ మల్లికార్జునరెడ్డి మాట్లాడుతూ.. జీఐఎస్ అనుబంధ విభాగాల్లో ప్రపంచ అత్యుత్తమ అభ్యాసాలను ప్రోత్సహించే సాంకేతిక శిక్షణా కార్యక్రమాలతో విద్యార్థులు, అధ్యాపకులను అభివృద్ధి చేయడానికి విశ్వవిద్యాలయంతో కలిసి బౌర్న్టెక్ పనిచేస్తుందని తెలిపారు.