KTR | హైదరాబాద్, అక్టోబర్ 17 (నమస్తే తెలంగాణ): మూసీ ప్రాజెక్టు విషయంలో కాంగ్రెస్ సర్కార్ ప్రత్యేకించి ముఖ్యమంత్రి మీడియా సమావేశంలో అర్థరహితమైన వ్యాఖ్యలు చేశారని బీఆర్ఎస్ భగ్గుమంటుంది. మూసీనది ప్రక్షాళన కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు, ఫలితంగా మూసీ పరివాహక ప్రాంతంలోని ప్రజలకు కలిగిన ప్రయోజనాలు, మూసీ ప్రాజెక్టు కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం వేసిన అడుగులు మొదలైన అంశాలపై పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శుక్రవారం మీడియా కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. మూసీ ప్రక్షాళన కోసం బీఆర్ఎస్ చేపట్టిన కార్యాచరణపై కేటీఆర్ వెల్లడించనున్న అంశాలపై సర్వత్రా ఆసక్తి నెలకొన్నది.