Legal Notice | హైదరాబాద్, మార్చి 25 (నమస్తే తెలంగాణ): రాడిసన్ బ్లూ హోటల్లో పట్టుబడిన డ్రగ్స్ కేసులో తనపై తప్పుడు వార్తలు ప్రసారం చేశాయంటూ 16 మీడియా సంస్థలకు కేటీఆర్ బావమరిది పాకాల రాజేంద్రప్రసాద్ లీగల్ నోటీసులు పంపించారు. తప్పుడు వార్తలు రాసిన ఆయా మీడియా సంస్థలు తనకు తక్షణం బహిరంగ క్షమాపణలు చెప్పడంతోపాటు తన పరువుకు భంగం కలిగించినందుకు ఒక్కో సంస్థ రూ. 10 నష్టపరిహారం చెల్లించాలని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. వీటితోపాటు గూగుల్, యూట్యూబ్ చానళ్లకు కూడా నోటీసులు జారీచేశారు. ఫిబ్రవరి 24న రాడిసన్ బ్లూ హోటల్‌పై దాడిచేసిన పోలీసులు డ్రగ్స్ పట్టుకున్నారు. ఈ కేసులో కేటీఆర్ బావమరిది పాకాల రాజేంద్రప్రసాద్ ప్రధాన సూత్రధారి అంటూ మీడియాలో వార్తలు వచ్చాయి. బీఆర్ఎస్ నేత, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ ప్రతిష్ఠను దెబ్బతీయడమే లక్ష్యంగా కథనాలు ప్రసారం చేశారు. ఈ ఘటన తర్వాత పోలీసులు కానీ, విచారణ సంస్థలు కానీ రాజేంద్రప్రసాద్‌ను నిందితుడిగా ఎక్కడా పేర్కొనలేదు. ఆయనను సంప్రదించలేదు. అయినప్పటికీ మీడియా సంస్థలు మాత్రం ఆయనను లక్ష్యంగా చేసుకుని వార్తలు ప్రసారం చేశాయి.
వాటిని తొలగించి క్షమాపణ చెప్పండి
రాడిసన్ బ్లూ హోటల్లో దొరికిన డ్రగ్స్‌కు తనకు ఎలాంటి సంబంధమూ లేకపోయినా తానే సూత్రధారినంటూ వార్తలు ప్రసారం చేసిన మీడియా సంస్థలు తన పరువుకు నష్టం కలిగించాయని, నిరాధార వార్తలు ప్రసారం చేశారని పేర్కొంటూ తాజాగా రాజేంద్రప్రసాద్ ఆయా మీడియా సంస్థలకు తన న్యాయవాది ద్వారా లీగల్ నోటీసులు పంపించారు. తన పరువుకు భంగం కలిగించేలా ప్రసారం చేసిన ఆ వార్తలు, కథనాలు, వీడియోలను తక్షణం ఎలక్ట్రానిక్, సోషల్ మీడియా నుంచి తొలగించి బేషరతుగా క్షమాపణలు చెప్పాలని, భవిష్యత్తులోనూ తన పరువుకు భంగం వాటిల్లేలా వ్యవహరించరాదని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. ఉద్దేశపూర్వకంగా తన పరువుకు నష్టం కలిగించి, తనను తీవ్ర మనోవేదనకు గురిచేసినందుకు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. నోటీసులు అందిన వారం రోజుల్లో స్పందించకుంటే తదుపరి తాము తీసుకోబోయే సివిల్, క్రిమినల్ చర్యలకు బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు.
తప్పుడు వార్తలు రాసిన మీడియా సంస్థలు ఇవే