హైదరాబాద్, సెప్టెంబర్ 17 (నమస్తే తెలంగాణ): రేవంత్ సర్కార్ కక్షసాధింపు చర్యలు మితిమీరుతున్నాయి. ప్రతిపక్ష నేతలతోపాటు వారి సిబ్బందిపైనా వికృత చర్యలకు పాల్పడు తున్నది. ప్రజల పక్షాన నిత్యం పోరాడు తూ, రేవంత్‌రెడ్డి సర్కార్ వైఫల్యాలను ఎండగడుతున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, బీఆర్ఎస్ఎల్పీ ఉపనేత హరీశ్‌రావును ఏమీ చేయలేక పిచ్చుకలపై బ్రహ్మాస్త్రంలాగా వారి సిబ్బందిపై విపరీత చర్యలకు దిగుతున్నదని పార్టీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.
కేటీఆర్‌ను ఏమీ చేయలేని సర్కార్.. ఆయన పీఏ మహేందర్‌రెడ్డి, పీఆర్వో (జర్నలిస్టు) మహేశ్ ముదిరాజ్‌పై వేధింపులకు పా ల్పడుతున్నది. హైకోర్టు ఆదేశాలను ధిక్కరిస్తూ పోలీసులతో సాధించేందుకు ప్రయత్నిస్తున్న ది. వినాయక చవితి పండుగ రోజున వారిని విచారణ పేరిట స్టేషన్లో వేధింపులకు పాల్పడగా, గురువారం కూడా సైఫాబాద్ పోలీస్‌స్టేషన్ వద్ద హై డ్రామా కొనసాగింది. పోలీసుల విధులకు ఆటంకం కలిగించారన్న కేసులో మహేశ్ ముదిరాజ్, మహేందర్‌రెడ్డిని రెండోసారి విచారణకు పిలిచిన పోలీసులు.. మధ్యాహ్నం 3నుంచి అర్ధరాత్రి వరకూ అక్కడే ఉంచారు.
గురువారం కూడా అదే వేధింపులకు పాల్పడ్డారు. వారిపై పోలీస్‌స్టేషన్‌లోనే పండుగ రోజు దాడి జరుగగా, తమకు రక్షణ కల్పించాలని కోర్టును ఆశ్రయించారు. భద్రత కల్పించి విచారణ చేపట్టవచ్చని కోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో మళ్లీ విచారణకు పిలువగా, రాత్రి 11గంటల వరకు విచారణ ముగిసేసరికి, మరో కేసులో బొల్లారం పోలీసులు అరెస్టు చేశారు. హైకోర్టు ఆదేశాలు పాటించకపోతే పోలీసులను కూడా కోర్టుకు ఈడ్చుతామని బీఆర్ఎస్ లీగల్ టీమ్ చెప్పింది. నోటీసులిచ్చి.. తీసుకెళ్లాలని కోర్టు చెప్పినా కూడా నిర్దాక్షిణ్యంగా తరలించడంపై మండిపడ్డారు. బీఆర్ఎస్ నేతలు మన్నె క్రిశాం క్, గెల్లు శ్రీనివాస్‌యాదవ్, మేడే రాజీవ్‌సాగర్, కిశోర్‌గౌడ్ తదితరులు అర్ధరాత్రి వరకూ మహేశ్ ముదిరాజ్‌కు అండగా నిలిచారు.