హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 26 ( నమస్తే తెలంగాణ )/ మల్కాజిగిరి : చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంను బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బుధవారం పరామర్శించారు. అల్వాల్‌లోని పంచశీల కాలనీలో నివసిస్తున్న ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఇంటికి వచ్చిన కేటీఆర్.. ఎమ్మెల్యే సతీమణి రూపాదేవి చిత్రపటానికి పూలు వేసి నివాళులర్పించారు. ఎమ్మెల్యేతో పాటు కుమారుడు యోజిత్(11), కుమార్తె రుషికశ్రీని ఓదార్చారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు పాడి కౌశిక్‌రెడ్డి, కేపీ వివేకానంద్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ తదితరులు పాల్గొన్నారు.