హైదరాబాద్, మే 28 (నమస్తే తెలంగాణ): అధికారంలో ఉన్నా లేకున్నా తెలంగాణ అభివృద్ధి కోసం త్రికరణశుద్ధితో పనిచేస్తూనే ఉంటామని బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టంచేశారు. తెలంగాణ సాధకులు గా, మాతృభూమిపై తమకుండే ప్రేమ, మమకారం, అభిమానం ఇంకెవరకీ ఉండబోవని స్పష్టంచేశారు. యూకే పర్యటనలో ఉన్న కేటీఆర్‌ను పలువురు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, యునైటెడ్ కింగ్డమ్ తెలుగు బిజినెస్ కౌన్సిల్ ప్రతినిధులు బుధవారం కలిశారు. తెలంగాణలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిస్థితులు, వ్యాపార నిర్వహణకు ఎదురవుతున్న సవాళ్లతోపాటు కాంగ్రెస్ ప్రభుత్వ అభివృద్ధి నిరోధక విధానాలపై చర్చించారు.
ముఖ్యమంత్రిగా కేసీఆర్ అమలుచేసిన ప్రగతిశీల విధానాలు, తీసుకున్న పారిశ్రామిక అనుకూల నిర్ణయాలతో పదేండ్లపాటు తెలంగాణ పెట్టుబడులకు గమ్యస్థానంగా మారిందని కేటీఆర్ చెప్పారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఎన్నో సంస్థలు పెట్టుబడులు పెట్టిన విషయాన్ని ప్రస్తావించారు. యాపిల్, గూగుల్, మైక్రోసాఫ్ట్, అడోబ్ వంటి కార్పొరేట్ దిగ్గజాలకు తెలంగాణ నయా చిరునామాగా మారిందని చెప్పారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తీసుకున్న విప్లవాత్మకమైన నిర్ణయాలు, తీసుకొచ్చిన పారదర్శక విధానాలతో పారిశ్రామిక రంగంలో దేశంలోనే తెలంగాణ అగ్రగామిగా నిలిచిందని గుర్తుచేశారు. తెలంగాణ గడ్డను ప్రేమించే వ్యక్తిగా అధికారంలో ఉన్నా లేకున్నా రాష్ట్ర అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని స్పష్టంచేశారు. తెలంగాణలో పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చే ప్రతి ఒకరికీ సాధ్యమైనంత సహకారం అందించాలని సమావేశానికి హాజరైనవారికి విజ్ఞప్తి చేశారు. తెలంగాణ ప్రగతికి బ్రాండ్ అంబాసిడర్లుగా పనిచేయాలని కోరారు.
యూకేలో రజతోత్సవాలు
భారత రాష్ట్ర సమితి పురుడుపోసుకొని 25 ఏండ్లు పూర్తయిన సందర్భంగా త్వరలో యునైటెడ్ కింగ్డమ్ (యూకే)లోనూ రజతోత్సవ సం బురాలను నిర్వహించనున్నట్టు కేటీఆర్ చెప్పా రు. లండన్‌లో అకడి పార్టీ ఎన్నారై నేతలతో సమావేశమైన ఆయనను ఇంగ్లండ్‌లోనూ బీఆర్ఎస్ రజతోత్సవాలను ఏడాదిపాటు నిర్వహించాలని కోరారు. ప్రాంతాలకు అతీతంగా యూకే లో ఉన్న తెలుగువాళ్లంతా ఈ సంబురాల్లో పా ల్గొనేందుకు ఉత్సాహంగా ఉన్నారని తెలిపారు. కేటీఆర్ స్పందిస్తూ పార్టీ అధినేత కేసీఆర్ ఆదేశా ల మేరకు రజతోత్సవాలను యూకేలోనూ జరుపుదామని చెప్పారు. ఇప్పటికే వరంగల్ బహిరంగ సభ ద్వారా రజతోత్సవాలను అట్టహాసం గా ప్రారంభించగా, ఏడాదిపాటు వివిధ రూపా ల్లో, దేశ విదేశాల్లో వేడుకలు కొనసాగించనున్నట్టు తెలిపారు. ఇందులో భాగంగా అమెరికాలోని డాలస్‌లో జూన్ 1న వేడుకలు నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు. యూకేలోనూ భారీ ఎత్తున సంబురాలు చేయనున్నట్టు చెప్పారు. ఈ వేడుకలకు తనతోపాటు పార్టీ సీనియర్ నేతలు, తెలంగాణ కళాకారులు, వివిధ రంగాల ప్రముఖులు హాజరవుతారని వెల్లడించారు.
తెలంగాణవాదానికి గొప్ప ప్రతీకలు..
బీఆర్ఎస్ యూకే ఎన్నారై విభాగం కార్యవర్గం మలిదశ ఉద్యమంలో తెలంగాణవాదానికి గొప్ప ప్రతీకగా నిలిచిందని కేటీఆర్ ప్రశంసించారు. బీఆర్ఎస్ హయాంలో పదేండ్లలో జరిగిన తెలంగాణ అభివృద్ధికి బ్రాండ్ అంబాసిడర్‌గా పనిచేసిందని మెచ్చుకున్నారు. ఉద్యమనేత కేసీఆర్ మార్గనిర్దేశనంలో దేశానికే రోల్ మోడల్‌గా మారిన తెలంగాణను ప్రపంచ వేదికలపై గొప్ప గా చూపించడంలో ఎన్నారై నేతలు సక్సెస్ అ య్యారని చెప్పారు. ఏడాదిన్నర నుంచి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న దోపిడీ, అరాచకాలు, ప్రజలపై వేధింపులను బాగా ఎండగడుతున్నారని ప్రశంసించారు. ఇంగ్లండ్‌లో ఉన్న సోషల్ మీడియా వారియర్స్‌పై అక్రమ కేసులు పెట్టినా ఎకడా వెనకి తగ్గకుండా రేవంత్ ప్రభు త్వ దాష్టీకాలను ప్రశ్నిస్తున్నారని కొనియాడారు. తెలంగాణలో ఏ మూలకు వెళ్లినా కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత కనిపిస్తున్నదని తెలిపారు. ఖండాంతరాల్లో ఎకడ ఉన్నా తెలంగాణ ప్రజలకు జరుగుతున్న మోసాలను లేవనెత్తాలని ఎన్నారైలకు పిలుపునిచ్చారు. ఏడాదిగా తాము చేసిన కార్యక్రమాలను పార్టీ ఎన్నారై విభాగం కేటీఆర్‌కు వివరించింది. రజతోత్సవాల ప్రణాళికలను కూడా ఆయనతో పంచుకున్నది.