KTR | మన పత్రిక మన ఆత్మగౌరవం పేరుతో తెలంగాణ ప్రజల గొంతుకగా మారి ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించింది ‘నమస్తే తెలంగాణ’ దినపత్రిక. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మార్గనిర్దేశకత్వంలో తెలంగాణ ఉద్యమం మొదలుకొని ప్రత్యేక రాష్ట్ర కల సాకారంలో, తెలంగాణ అభివృద్ధి, సంక్షేమంలో కీలక పాత్ర పోషించిన నమస్తే తెలంగాణ నేటితో 15వ వసంతంలోకి అడుగుపెడుతోంది.
ఈ సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ అక్షర ఆయుధం నమస్తే తెలంగాణకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు ఎక్స్‌లో ఆయన ఓ సందేశాన్ని పంచుకుంటూ ట్వీట్ చేశారు. తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగుస్తున్న సమయంలో తెలంగాణ ప్రజల గొంతును వినిపించడానికి, స్వరాష్ట్ర ఆకాంక్షను చాటడానికి, తెలంగాణ వ్యతిరేకుల కుట్రలను పటాపంచలు చేయడానికి పురుడు పోసుకున్న అక్షర ఆయుధం ‘నమస్తే తెలంగాణ’ దినపత్రిక. ‘మన పత్రిక… మన ఆత్మగౌరవం’ అనే నినాదంతో తెలంగాణ కోసం 15 ఏళ్లుగా అక్షర కవాతు చేస్తున్నది నమస్తే తెలంగాణ అన్నారు.
తమ కలం ద్వారా తెలంగాణ గళాన్ని బలంగా వినిపిస్తున్న నమస్తే తెలంగాణ పత్రిక యాజమాన్యానికి, సంపాదక బృందానికి, జర్నలిస్ట్ మిత్రులకు, జిల్లాలు, మండలాల్లోని విలేకరులకు నమస్తే తెలంగాణ 15వ వార్షికోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నానన్నారు.
తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగుస్తున్న సమయంలో తెలంగాణ ప్రజల గొంతును వినిపించడానికి, స్వరాష్ట్ర ఆకాంక్షను చాటడానికి, తెలంగాణ వ్యతిరేకుల కుట్రలను పటాపంచలు చేయడానికి పురుడు పోసుకున్న అక్షర ఆయుధం “నమస్తే తెలంగాణ” దినపత్రిక.
‘మన పత్రిక… మన ఆత్మగౌరవం’ అనే నినాదంతో తెలంగాణ కోసం 15… pic.twitter.com/IzsaXyKr54
— KTR (@KTRBRS) June 6, 2026
Good news | వైద్య నిపుణులకు గుడ్ న్యూస్.. తిరుమలలో ప్రయోగాత్మకంగా శ్రీవారి వైద్య సేవలు ప్రారంభం
ప్రజల భాగస్వామ్యంతోనే నగరాభివృద్ధి : నల్లగొండ మున్సిపల్ కమిషనర్ బి.శరత్ చంద్ర