హైదరాబాద్ : ఇటీవల మరణించిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్ రావు ( Nadendla Bhasker Rao) చిత్రపటానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ( KTR ) పూలమాలలు వేసి నివాళులర్పించారు. హైదరాబాద్లోని నాదెండ్ల నివాసానికి వెళ్లి ఏపీ మంత్రి నాదెండ్ల మనోహర్ (Nadendla Manohar ) ను, కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చరు.
ఈ సందర్భంగా తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకానంద, ఎమ్మెల్సీ రాజు శంభీపూర్, మాజీ ఎంపీ రావుల చంద్రశేఖర్, బీఆర్ఎస్ నాయకులు నాదెండ్ల చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించిన వారిలో ఉన్నారు. నాదెండ్ల మనోహర్ గారిని మరియు ఇతర కుటుంబ సభ్యులను పరామర్శించి, తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.