హైదరాబాద్, ఫిబ్రవరి 29 (నమస్తే తెలంగాణ) : అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్షిప్కు సంబంధించి తదుపరి విడత మొత్తాన్ని త్వరగా విడుదల చేయాలని రాష్ట్ర డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విజ్ఞప్తి చేశారు.
కేసీఆర్ ప్రభుత్వ హయాంలో 7 వేల మందికిపైగా ఎ స్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఈబీసీ విద్యార్థులు అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్షిప్ను పొందారని, అయితే తదుపరి విడతకు సంబంధించిన మొత్తాన్ని త్వరగా విడుదల చేయాలని కేటీఆర్ ట్వీట్లో పేర్కొన్నారు.