హైదరాబాద్, ఏప్రిల్ 23 (నమస్తే తెలంగాణ): ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ తన పాఠశాలలో ఉన్నప్పటి ఫొటోను జర్నలిస్టు క్రిష్రాజ్మురారి శనివారం ట్విట్టర్లో పోస్ట్ చేస్తూ ‘కేటీఆర్ మీకు జ్ఞాపకం ఉందా? ఎన్పీఎస్ (నలంద పబ్లిక్ స్కూల్) 1988 బ్యాచ్.. ఈ ఫొటోలో ఎవరైనా ఫ్యూచర్ లీడర్‌ను గుర్తించగలరా? కేటీఆర్ ఎక్కడ ఉన్నారు గుర్తించండి’అని కామెంట్ పెట్టారు. దీనిపై స్పందించిన మంత్రి కేటీఆర్ ‘ఈ చిత్రానికి ధన్యవాదాలు. నలంద పబ్లిక్ స్కూల్లో నా హాస్టల్ రోజులను ఈ ఫొటో గుర్తు చేసింది’ అని రిైప్లె ఇచ్చారు. నెటిజన్లు ఆ ఫొటోలో కేటీఆర్‌ను గుర్తించే ప్రయత్నం చేశారు.
ఆడబిడ్డ చదువుకు కేటీఆర్ సాయం
పేదింటి ఆడబిడ్డ ఎంబీబీఎస్ చదువుకు మంత్రి కేటీఆర్ భరోసా ఇచ్చారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెండు మండలం మసివాగుకు చెందిన రమేశ్, రమాదేవి కూతురు అంజలికి ఎంబీబీఎస్ సీటు వచ్చింది. ఆమె తండ్రి ఆటో డ్రైవర్. రూ.లక్షా 10 వేలు కట్టి కాలేజీలో చేర్పిం చారు. ఇతర ఖర్చులకు మరో రూ.2 లక్షలు కావాలి. స్పందించిన మంత్రి ఆ మొత్తం సాయం చేస్తామని హామీ ఇచ్చారు.