శనివారం 04 ఏప్రిల్ 2020
Telangana - Mar 19, 2020 , 12:20:30

విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను తీసుకురండి.. మోదీకి కేటీఆర్‌ ట్వీట్‌

విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను తీసుకురండి.. మోదీకి కేటీఆర్‌ ట్వీట్‌

హైదరాబాద్‌ : ప్రపంచ దేశాల్లో కరోనా వైరస్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో అన్ని దేశాలు అప్రమత్తమయ్యాయి. ఈ నేపథ్యంలో విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను సురక్షితంగా తీసుకురావాలని ప్రధాని నరేంద్ర మోదీకి మంత్రి కేటీఆర్‌ ట్విట్టర్‌లో విజ్ఞప్తి చేశారు. విదేశాల్లోని భారతీయులంతా విమానాశ్రయాల్లోనే ఉండిపోయినట్లు సమాచారం అందుతోందని కేటీఆర్‌ తెలిపారు. మనీలా, రోమ్‌, సింగపూర్‌, కౌలాలంపూర్‌ విమానాశ్రయాల్లో ఉన్నట్లు సందేశాలు వచ్చాయి. వారందరినీ స్వస్థలాలకు పంపించేలా ఏర్పాట్లు చేయాలని కేటీఆర్‌ ప్రధాని మోదీకి వినతి చేశారు. 


logo