హైదరాబాద్, ఫిబ్రవరి 4(నమస్తే తెలంగాణ) : ‘ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నోటి నుంచి వచ్చేది మురికిభాషే తప్ప పథకాలు, పాలసీలు రావు.. హార్వర్డ్‌లో 5 రోజులు కాదు.. 500 రోజులు కోర్సులు చేసినా ఆయన నీచపు బుద్ధి మా రలేదు..’ అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విరుచుకుపడ్డారు. వేదిక ఏదైనా కేసీఆర్‌పై మురికిభాష మాట్లాడటం దౌర్భాగ్యమని బుధవారం ఎక్స్ వేదికగా ధ్వజమెత్తారు. 14 ఏండ్లు అలుపెరుగని పోరాటం చేసి, ప్రాణాలను పణంగా పెట్టి తెలంగాణను సా ధించి, తొలి ముఖ్యమంత్రిగా బంగారు తెలంగాణకు బాటలు వేసిన కేసీఆర్‌ను పరుషపదజాలంతో దూషించడం దు ర్మార్గమని నిప్పులు చెరిగారు. మురికిభాష మాట్లాడే వారి స్థానం ఎప్పటికీ మురికికాలువేనంటూ ఎద్దేవా చేశారు.
పాలన చేతగానివాడే విషం చిమ్ముతాడ ని చురకలంటించారు. తెలంగాణ కలను సాకారం చేసి చరిత్ర సృష్టించిన నాయకుడిని మాటలతో తక్కువ చేయలేరని స్పష్టంచేశారు. మురికిభాష మాట్లాడేవారు తన మానసిక దారిద్య్రాన్ని ప్రజల ముందు బహిర్గతం చేస్తాడని, మిర్యాలగూడలో ముఖ్యమంత్రి అనుచిత వ్యా ఖ్యలే ఇందుకు నిదర్శనమని దుయ్యబట్టారు. ‘రాష్ర్ట్టాన్ని సాధించి చరిత్ర సృ ష్టించి, తెచ్చుకున్న తెలంగాణను దారిలో పెట్టిన మహానేతపై నోరువిప్పే నైతిక హక్కు నీకు లేదు.. రేవంత్‌రెడ్డి నీ చెత్తమాటలు చరిత్ర సృష్టించిన కేసీఆర్ ప్రతిష్ఠను మసకబార్చలేవు’ అంటూ దుమ్మెత్తిపోశారు. తెలంగాణ సమాజం అన్నీ గమనిస్తున్నదని, తగిన బుద్ధి చెప్పేందుకు ఎదురుచూస్తున్నదని కేటీఆర్ హెచ్చరించారు.