రామారెడ్డి, ఫిబ్రవరి 25 : కూల్‌డ్రింక్ అనుకుని గండిమందు తాగి దవాఖాన పాలైన ఇద్దరు చిన్నారులకు కేటీఆర్ అండ గా నిలిచారు. వైద్యానికి అయిన ఖర్చును చెల్లించి పెద్దమనసు చాటుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. రామారెడ్డి మండలం స్కూల్తండాకు చెందిన గంగావత్ మంత్‌కు భార్య, ఇద్దరు కూతుళ్లు సంజన, బిందు ఉన్నారు. మంత్ పొలానికి కొట్టేందుకని తెచ్చిన మందును థమ్సప్ బాటిల్లో నింపిపెట్టా డు. శనివారం స్కూల్ నుంచి వచ్చిన కూతు ళ్లు థమ్సప్ బాటిల్‌ను చూసి కూల్‌డ్రింక్‌గా భావించి తాగారు. అస్వస్థతకు గురికావడంతో కుటుంబ సభ్యులు రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట్ దవాఖానలో చేర్పించగా కోలుకున్నారు. తల్లిదండ్రులు దవాఖాన బిల్లులు కట్టేందుకు తీవ్ర ఇబ్బందులుపడుతున్న విషయం తెలిసిన కేటీఆర్.. జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు తోట ఆగయ్యను దవాఖానకు వెళ్లాలని ఆదేశించారు. మంగళవారం దవాఖానకు వెళ్లిన ఆగయ్య పిల్లల వైద్యానికి అయిన ఖర్చును చెల్లించి డిశ్చార్జి చేయించారు. కేటీఆర్, పార్టీ నేతలకు చిన్నారుల తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు.