KTR | కేటీఆర్(KTR) కన్నెపల్లి పర్యటన కాంగ్రెస్ ప్రభుత్వంలో వణుకుపుట్టిస్తున్నది. కన్నెపల్లి Kannepalli వెళ్లకుండా కేటీఆర్ బృందాన్ని అడ్డుకునేందుకు పోలీసు బలగాలతో ప్రభుత్వం అడుగడుగునా అడ్డుకుంటు న్నది. కేటీఆర్ పర్యటన నేపథ్యంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉద్రిక్త వాతావరణం కొనసాగుతోంది. జనగామ జిల్లా పెంబర్తి వద్ద హైవే మీద బారికేడ్లు పెట్టి కేటీఆర్‌ను కాన్వాయ్‌ను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులను బీఆర్ఎస్ నేతలు ప్రశ్నించారు.
ఈ క్రమంలో పోలీసులు, బీఆర్ఎస్ నాయకుల మధ్య వాగ్వాదం నెలకొంది. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ..ఎన్ని అడ్డంకులు సృష్టించినా కన్నెపల్లి వెళ్లి తీరుతానని స్పష్టం చేశారు. నీళ్లు ఉన్నా ఇవ్వకుండా ప్రభుత్వం రైతులను ఇబ్బంది పెడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. కన్నెపల్లి నుంచి నీటిని విడుదల చేస్తే లక్షల ఎకరాలకు నీళ్లు ఇవ్వొచ్చని పేర్కొన్నారు. సర్కార్ చేతకాని తనాన్ని ప్రజలకు చూపుతామని కేటీఆర్ అన్నారు.