జయశంకర్ భూపాలపల్లి : మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలతో జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలం అంబటిపల్లి గ్రామంలో ఉన్న మేడిగడ్డ(Medigadda) బరాజ్‌కు వరద ప్రవాహం పోటెత్తుతుంది. బరాజ్ ఇన్ ఫ్లో 90,580 క్యూసెక్కుస్ ల వరద ప్రవాహం రాగా బరాజ్ లోని మొత్తం 85 గేట్లు ఎత్తి అంతే మొత్తం లో నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
వరద ప్రవాహం మరింత పెరిగే అవకాశం ఉందని భారీ నీటిపారుదల శాఖ అధికారులు తెలిపారు. లోతట్టు గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు.