హైదరాబాద్: రాష్ట్రంలో అంతులేని అరాచకత్వమూ, అపరిమితమైన అజ్ఞానమూ రాజ్యమేలుతున్నాయని రేవంత్ ప్రభుత్వం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది కాంగ్రెస్ సర్కార్ కాదిది.. సర్కస్ అంటూ ఎక్స్ వేదికగా ధ్వజమెత్తారు.
‘స్థానిక సమస్యలు తీర్చడానికి
రాష్ట్ర ప్రభుత్వం పైసలు ఇస్తలేదని పత్రికలకెక్కుతాడు
పాలమూరు కాంగ్రెస్ ఎమ్మెల్యే!
భారీవర్షాల వల్ల
నియోజకవర్గంలో నష్టం వాటిల్లితే
రాష్ట్ర ప్రభుత్వం నిధులిస్తలేదని
ఏకంగా ప్రపంచబ్యాంకుకే ఉత్తరం రాసి నవ్వులపాలవుతాడు
ఎల్లారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే!
రాష్ట్ర కాలుష్య నియంత్రణ బోర్డు
సరిగ్గా పనిచేస్తలేదు కాబట్టి
పరిశ్రమనే తగులబెడతానని బెదిరించి రౌడియిజం చేస్తాడు
జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే!
అంతులేని అరాచకత్వమూ,
అపరిమితమైన అజ్ఞానమూ
రాజ్యమేలుతున్నాయి నేడు తెలంగాణలో.
సర్కారు కాదిది సర్కసే!’ అని కేటీఆర్ ట్వీట్ చేశారు.