హైదరాబాద్, ఫిబ్రవరి 6 (నమస్తే తెలంగాణ): స్నేహితుడి సహాయంతో మూడేండ్ల క్రితం కొద్దిమందితో ప్రారంభించిన ఎన్టీటీ సేవలు ఇంతింతై వటుడింతైనట్టుగా పెరిగాయ ని మాజీ మంత్రి కేటీఆర్ తెలిపారు. ‘మూడేం డ్ల క్రితం నా మిత్రుడు సంజీవ్ దేశ్‌పాండే స హాయంతో ఆదిలాబాద్‌లో 50 మందితో ఇ న్ఫర్మేషన్ టెక్నాలజీ కంపెనీ ఎన్టీటీ డాటా సేవలను ప్రారంభించాను. ఇప్పుడు సంఖ్య పెరిగి 400 మందిని దాటినట్టు తెలిసింది. ఎన్టీటీ డాటా ఉద్యోగులు 280 మంది, బీడీఎన్టీ ల్యాబ్స్ ఉద్యోగులు 70 మంది ఉన్నారు.
నివేదా బిజినెస్ సొల్యూషన్స్ (ఇంక్యూబేటర్ సెంటర్)లో 30 మందికిపైగా సభ్యులకు శిక్షణ ఇస్తున్నారు. మేము టైర్-2 పట్టణాల్లో ప్రారంభించిన ఐటీ సేవలు గొప్ప విజయం సాధించాయనడానికి ఇదో నిదర్శనం’ అని గురువారం ఎక్స్ వేదికగా కేటీఆర్ పేర్కొన్నారు.
పడకేసిన పల్లెలు రాష్ట్రంలో పాలకుల మొద్దునిద్రకు సూచికలని కేటీఆర్ పేర్కొన్నారు. రాష్ట్ర సచివాలయం నుంచి గ్రామ సచివాలయాల దాకా పాలన పడకేసిందని ఎక్స్ వేదికగా విమర్శించారు. పడకేసిన పారిశుద్ధ్యం తో ప్రజలు రోగాలపాలు అవుతున్నారని, వీధిదీపాలు వెలగక చిమ్మచీకట్లు అలముకున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. ప్రజాపాలన.. ఇందిరమ్మ రాజ్యం అంటే ఇదేనా? అని ధ్వజమెత్తారు. ప్రత్యేకాధికారుల పాలనకు ఏడాదైనా కండ్లు తెరవరా? అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ హయాంలో పల్లెప్రగతితో రూపురేఖలు మారి పంచాయతీలకు ఠంచన్‌గా నిధులు వచ్చాయని గుర్తుచేశారు.