KTR | ప్రజా సమస్యల నుంచి దృష్టి మళ్లించేందుకు సీఎం రేవంత్‌రెడ్డి ప్రయత్నించారని.. అందులో భాగంగానే ప్రచారం కోసమే సినిమా వాళ్ల గురించి మాట్లాడారని బీఆర్ఎస్ నేత కల్వకుంట్ల తారక రామారావు విమర్శించారు. తెలంగాణ భవన్లో సోమవారం ఆయన మీడియాతో చిట్‌చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన అల్లు అర్జున్ వ్యవహారంపై స్పందించారు. అటెన్షన్, డైవర్షన్ కోసమే సీఎం రేవంత్‌రెడ్డి పాలకులాడారని విమర్శించారు. సినిమా వాళ్లతో సెటిల్మెంట్ చేసుకొని ఇప్పుడు మాట్లాడట్లేదని ఆరోపించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయడం చేతగాక.. ప్రజల నుంచి విమర్శలు వస్తాయన్న భయంతోనేట్ట్ర్ చేసే క్రమంలోనే హీరో అల్లు అర్జున్ను టార్గెట్ చేశారని మండిపడ్డారు. రాష్ట్రంలో జరిగిన మరణాలపై ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి లేదని ధ్వజమెత్తారు. గురుకుల్లో చనిపోయిన విద్యార్థుల కుటుంబాలకు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆటో డ్రైవర్ల కుటుంబాలకు సైతం పరిహారం ఇవ్వాల్సిందేనన్నారు. రైతన్నలు, నేతన్నల మరణాలపై సైతం సీఎం స్పందించాలన్నారు. అందరికీ కనీసం రూ.25లక్షల పరిహారం చెల్లించాలన్నారు. వారందరికీ పరిహారం చెల్లించే వరకు.. ప్రభుత్వాన్ని ఎండగడుతామన్నారు. హైడ్రాను సైతం ప్రభుత్వం డైవర్షన్‌లో భాగంగానే తీసుకువచ్చిందని ఆయన మండిపడ్డారు.