హైదరాబాద్, ఫిబ్రవరి 28 (నమస్తే తెలంగాణ): మొక్కలను నాటి పరిరక్షించడమే గాకుండా చెట్లకు ఆధార్‌కార్డును రూపొందించడం అద్భుతమని మాజీ మంత్రి కేటీఆర్ కొనియాడారు. సాంకేతికతను జోడించి చెట్లు తమ చరిత్రను చెప్పుకొనేలా చేయడం గొప్ప విషయమన్నారు.
ఇందుకు నాందిపలికిన ముక్కెర గ్రామ మాజీ సర్పంచ్ మీనాక్షిని శుక్రవారం ఎక్స్ వేదికగా కేటీఆర్ అభినందించారు. భవిష్యత్‌లోనూ ఇదేస్ఫూర్తితో ముందుకెళ్లాలని ఆకాంక్షించారు.