హైదరాబాద్: అక్షర యుద్ధం చేసి, ధిక్కార స్వరం వినిపించిన వైతాళికుడు దాశరథి అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు. రుద్రవీణ, అగ్నిధార వంటి కావ్యాలతో ప్రజల్లో చైతన్యం నింపారని చెప్పారు. పీడిత ప్రజల గొంతుగా దాశరథి జీవించారని చెప్పారు. ఆయన తెలంగాణ ప్రజల ఉద్యమ స్ఫూర్తికి ప్రతిరూపమని తెలిపారు. దాశరథి జయంతి సందర్భంగా వారికి ఘనంగా నివాళులర్పించారు.
‘నా తెలంగాణ కోటి రతనాల వీణ’ అని ఎలుగెత్తి చాటిన మహాకవి దాశరథి కృష్ణమాచార్య గారు. కవిగా, రచయితగా తన రచనలతో ప్రజలలో ఉద్యమ స్ఫూర్తిని రగిలించిన దాశరథి గారి శత జయంతి సందర్భంగా వారికి ఘన నివాళులు. నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా అక్షర యుద్ధం సాగించి, ధిక్కార స్వరం వినిపించిన వైతాళికుడు దాశరథి కృష్ణమాచార్యులు. రుద్రవీణ, అగ్నిధార, కవితాపుష్యకం, పునర్నవం, అమృతాభిషేకం, తిమిరంలో సమరం లాంటి సంకలనాలు, అద్భుత కావ్యాలు రచించిన దాశరథి గారు తన కలంతో తెలంగాణ ప్రజల్లో చైతన్యాన్ని నింపారు.
పీడిత ప్రజల గొంతుకగా జీవించిన దాశరథి గారు తెలంగాణ ప్రజల ఉద్యమ స్ఫూర్తికి ప్రతిరూపం. అంతటి మహాకవిని బీఆర్ఎస్ ప్రభుత్వం సముచితంగా గౌరవించింది.. వారి పేరిట సాహితీ పురస్కారాన్ని ఏర్పాటు చేసింది, వారి జయంతిని (జూలై 22) అధికారికంగా నిర్వహించింది. ఆ మహనీయుడి రచనలను, వారి పోరాట స్ఫూర్తిని భావితరాలకు అందించే బాధ్యత మనందరిపై ఉంది.’ అని కేటీఆర్ ట్వీట్ చేశారు.
‘నా తెలంగాణ కోటి రతనాల వీణ’ అని ఎలుగెత్తి చాటిన మహాకవి దాశరథి కృష్ణమాచార్య గారు.
కవిగా, రచయితగా తన రచనలతో ప్రజలలో ఉద్యమ స్ఫూర్తిని రగిలించిన దాశరథి గారి శత జయంతి సందర్భంగా వారికి ఘన నివాళులు 🙏
నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా అక్షర యుద్ధం సాగించి, ధిక్కార స్వరం వినిపించిన వైతాళికుడు… pic.twitter.com/dI7rJzIHIA
— KTR (@KTRBRS) July 22, 2025