హైదరాబాద్, ఏప్రిల్ 24(నమస్తే తెలంగాణ) : ఉమ్మడి ఏపీ మాజీ సీఎం నాదెండ్ల భాసర్‌రావు మృతి పట్ల బీఆర్ఎస్ వరిం గ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో ఇటీవల కన్నుమూసిన భాసర్‌రావు నివాసానికి వెళ్లిన కేటీఆర్.. ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా నాదెండ్ల భాసర్‌రావు కుమారుడు, ఏపీ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, ఆయన కుటుంబసభ్యులను కేటీఆర్ పరామర్శించి ధైర్యం చెప్పారు. భాసర్‌రావు ఉమ్మడి రాష్ట్ర రాజకీయాల్లో తనదైన ముద్రవేశారని, ఆయన మరణం తీరని లోటని పేరొన్నారు. కేటీఆర్ వెంట మాజీ ఎంపీ రావుల చంద్రశేఖర్‌రెడ్డి, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, ఎమ్మెల్యే వివేకానందగౌడ్, నాయకులు కిశోర్‌గౌడ్, తుంగ బాలు, రాఘవ ఉన్నారు.