KTR | అంబేద్కర్ కీర్తి అజరామరం.. అంబేద్కర్ స్ఫూర్తి చిరస్మరణీయం: కేటీఆర్
KTR | అంబేద్కర్ కీర్తి అజరామరం.. అంబేద్కర్ స్ఫూర్తి చిరస్మరణీయమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. అణగారినవర్గాల అభ్యున్నతికి అహర్నిశలు శ్రమించిన మహనీయులు అంబేద్కర్ అని కొనియాడారు. పీడిత ప్రజల పక్షాన పోరాడిన విశ్వమానవుడు అంబేద్కర్ అని అన్నారు.

సబ్బండ వర్గాల ప్రజలకు హక్కులు పంచిన సమ సమాజ స్వాప్నికుడు అంబేద్కర్ అని కేటీఆర్ అన్నారు. భారత రాజ్యాంగానికి రూపకల్పన చేసిన మహా మేధావి అంబేద్కర్ అని తెలిపారు. ఆర్టికల్ 3 ద్వారా తెలంగాణ ప్రజల స్వరాష్ట్ర ఆకాంక్షను నెరవేరేలా చేసిన దార్శనికుడు అంబేద్కర్ అని పేర్కొన్నారు.
బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తితోనే తొమ్మిదిన్నరేళ్ల బీఆర్ఎస్ పాలన సాగింది.. భవిష్యత్తులోనూ కొనసాగుతుందని కేటీఆర్ తెలిపారు. అంబేద్కర్ బోధనలను, ఆశయాలను, విలువలను భావితరాలకు అందించేలా.. హైదరాబాద్ నగరం నడిబొడ్డున 125 ఫీట్ల అంబేద్కర్ విగ్రహాన్ని కేసీఆర్ ప్రభుత్వం ఏర్పాటు చేసిందని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర సచివాలయానికి అంబేద్కర్ పేరుపెట్టి వారికి సమున్నత గౌరవాన్ని కల్పించిందని చెప్పారు. భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆ మహోన్నతుడికి ఘన నివాళులు అర్పించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
France Protests | తీవ్ర ఉద్రిక్తంగా ఫ్రాన్స్ నిరసనలు.. 143 ఏళ్ల నాటి చారిత్రక భవనానికి నిప్పు..!
Jagadish Reddy | రాష్ట్రంలో పాలన చేతకాక చేతులెత్తేసిన కాంగ్రెస్ : మాజీ మంత్రి జగదీష్ రెడ్డి
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Hair Fall | జుట్టు రాలడానికి వారం క్రితం వచ్చిన మార్పులే కారణమా.. నిపుణులు ఏమంటున్నారు..?
Tugboat | సముద్ర జలాల్లో టగ్బోట్పై దాడి.. UKMTO వెల్లడి
ట్రెండింగ్ వార్తలు
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!