సత్తుపల్లి, మే 20 : డీసీఎంఎస్ మాజీ చైర్మన్, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు రాయల వెంకట శేషగిరిరావు(Rayala Seshagiri Rao) ఇటీవల అనారోగ్యంతో మృతిచెందిన విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్(KTR) సోమవారం ఖమ్మం జిల్లా తల్లాడ మండలం మిట్టపల్లిలోని ఆయన నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు.
రాయల శేషగిరిరావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు(Tribute). కుటుంబ సభ్యులను ఓదార్చి ప్రగాఢ సానుభూతి, సంతాపం తెలిపారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ రాయల పార్టీకి ఎనలేని సేవలు అందించారని, ఆయన అడుగుజాడల్లో నడవడమే ఆయనకు మనమిచ్చే ఘన నివాళి అని పేర్కొన్నారు. పార్టీ ఎల్లప్పుడూ రాయల కుటుంబానికి అండగా ఉంటుందన్నారు.
ఆయన వెంట మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి ఏనుగుల రాకేశ్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రెడ్డెం వీరమోహనరెడ్డి, ఎంపీపీ దొడ్డా శ్రీనివాసరావు, జడ్పీటీసీ దిరిశాల ప్రమీల, దుగ్గిదేవర వెంకట్‌లాల్ తదితరులు ఉన్నారు.