KTR | రూ.3 వేల కోట్ల విదేశీ బొగ్గు స్కామ్ ఆపాలి.. సీఎం రేవంత్‌కు కేటీఆర్ బహిరంగ లేఖ
KTR | భోత్రా లాజిస్టిక్స్‌తో కాంగ్రెస్ ప్రభుత్వం, సింగరేణి చేసుకున్న అన్ని రహస్య అగ్రిమెంట్లు బయటపెట్టాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. ఏ ప్రాతిపదికన సదరు కంపెనీని ఎంపిక చేశారో రేవంత్ సమాధానం సీఎం రేవంత్ రెడ్డి చెప్పాలన్నారు.
KTR | కాంగ్రెస్ సర్కార్ రూ. 3 వేల కోట్ల విదేశీ బొగ్గు స్కామ్ ఆపాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. ఈ మేరకు కేటీఆర్
సీఎం రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. విదేశీ బొగ్గు దిగుమతి ముసుగులో రూ. 3 వేల కోట్ల భారీ స్కామ్‌కు రేవంత్ రెడ్డి కుట్ర చేస్తున్నారని లేఖలో పేర్కొన్నారు.
భోత్రా లాజిస్టిక్స్ అనే అనుమానాస్పద కంపెనీతో ముందే ముఖ్యమంత్రి చీకటి ఒప్పందం చేసుకొని.. కావాలనే కృత్రిమ బొగ్గు కొరత, కరెంట్ సంక్షోభం సృష్టించి అదను చూసి కంపెనీని రంగంలోకి దింపారు. భోత్రా లాజిస్టిక్స్‌తో కాంగ్రెస్ ప్రభుత్వం, సింగరేణి చేసుకున్న అన్ని రహస్య అగ్రిమెంట్లు బయటపెట్టాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ఏ ప్రాతిపదికన సదరు కంపెనీని ఎంపిక చేశారో రేవంత్ సమాధానం చెప్పాలి. మొత్తం కుంభకోణంపై స్వతంత్ర సంస్థతో విచారణ జరిపించాలి. రేవంత్ విదేశీ బొగ్గు దిగుమతి పేరిట సింగరేణికి మరణశాసనం రాస్తున్నారు. కాంగ్రెస్-బీజేపీ కలిసి చేస్తున్న ఈ కుట్రలను బీఆర్ఎస్ పార్టీ చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదని హెచ్చరించారు. విదేశీ బొగ్గు దిగుమతుల విషయంలో ఎవరికి లబ్ధి చేకూర్చేందుకు ప్రయత్నిస్తున్నారో ముఖ్యమంత్రి రేవంత్ ప్రజలకు స్పష్టం చేయాలన్నారు.
యాదాద్రి పవర్ ప్లాంట్‌కు సరఫరా చేసేందుకు సింగరేణిలో G9 బొగ్గు లేదని అబద్ధాలు చెప్పడంపై కేటీఆర్ ఫైర్ అయ్యారు. సింగరేణి సంస్థకు రూ. 60 వేల కోట్ల బాకీ చెల్లించకుండా సంస్థను కుప్పకూల్చే కుతంత్రం చేస్తున్నారని ఆరోపించారు. దేశీయ సంస్థలను పక్కనపెట్టి కమీషన్ల కోసమే విదేశీ బొగ్గు కోసం వెంపర్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కమీషన్ల ముసుగులో ప్రతి టన్నుపై రూ.1,500 చొప్పున ఏకంగా రూ.3,000 కోట్ల దోపిడీకి సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క రంగం సిద్ధం చేశారన్న కేటీఆర్ అడ్డుకోవాల్సింది పోయి సహకరిస్తున్నారని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డిపై మండిపడ్డారు. సింగరేణిని బలహీనపరిచి.. విదేశీ బొగ్గు దిగుమతికి జరుగుతున్న కుట్రలను చూస్తూ ఊరుకోబోమని కేటీఆర్ హెచ్చరిస్తూ సుదీర్ఘ అంశాలను లేఖలో ప్రస్తావించారు.
✳️ రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS బహిరంగ లేఖ.. రూ. 3 వేల కోట్ల విదేశీ బొగ్గు స్కామ్ ఆపాలని డిమాండ్ 👇
♦️ విదేశీ బొగ్గు దిగుమతి ముసుగులో రూ. 3 వేల కోట్ల భారీ స్కామ్ కు రేవంత్ రెడ్డి కుట్ర
♦️ భోత్రా లాజిస్టిక్స్ అనే అనుమానాస్పద కంపెనీతో ముందే ముఖ్యమంత్రి చీకటి ఒప్పందం
♦️ కావాలనే కృత్రిమ బొగ్గు కొరత, కరెంట్ సంక్షోభం సృష్టించి అదను చూసి కంపెనీని రంగంలోకి దింపిన రేవంత్
♦️ భోత్రా లాజిస్టిక్స్‌తో కాంగ్రెస్ ప్రభుత్వం, సింగరేణి చేసుకున్న అన్ని రహస్య అగ్రిమెంట్లు బయటపెట్టాలి
♦️ ఏ ప్రాతిపదికన సదరు కంపెనీని ఎంపిక చేశారో రేవంత్ సమాధానం చెప్పాలి
♦️ మొత్తం కుంభకోణంపై స్వతంత్ర సంస్థతో విచారణ జరిపించాలి.
♦️ విదేశీ బొగ్గు దిగుమతి పేరిట సింగరేణికి మరణశాసనం రాస్తున్న రేవంత్
♦️ కాంగ్రెస్-బీజేపీ కలిసి చేస్తున్న ఈ కుట్రలను బీఆర్ఎస్ పార్టీ చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదు
♦️ యాదాద్రి పవర్ ప్లాంట్‌కు సరఫరా చేసేందుకు సింగరేణిలో G9 బొగ్గు లేదని అబద్ధాలు చెప్పడంపై మండిపాటు
♦️ సింగరేణి సంస్థకు రూ. 60 వేల కోట్ల బాకీ చెల్లించకుండా సంస్థను కుప్పకూల్చే కుతంత్రం చేస్తున్నారని ధ్వజం
♦️ దేశీయ సంస్థలను పక్కనపెట్టి కమిషన్ల కోసమే విదేశీ బొగ్గు కోసం వెంపర్లాడుతున్నారని ఆగ్రహం
♦️ కమీషన్ల ముసుగులో ప్రతి టన్నుపై రూ.1,500 చొప్పున ఏకంగా రూ.3,000 కోట్ల దోపిడీకి సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క రంగం సిద్ధం చేశారని దుయ్యబట్టిన కేటీఆర్
♦️ అడ్డుకోవాల్సింది పోయి సహకరిస్తున్నారని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డిపై కేటీఆర్ మండిపాటు
♦️ సింగరేణిని బలహీనపరిచి.. విదేశీ బొగ్గు దిగుమతికి జరుగుతున్న కుట్రలను చూస్తూ ఊరుకోబోమని కేటీఆర్ హెచ్చరిక
— BRS Party (@BRSparty) October 15, 2026
Read Also :
Vijay Deverakonda | ‘రణబాలి’ విడుదల వేళ పుట్టపర్తిలో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న!
President Murmu | మహిళలకు మరింత సాధికారత కల్పించేందుకు కృషి చేయాలి : రాష్ట్రపతి ముర్ము
unknown callers | గుర్తు తెలియని కాలర్స్పై ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఇకపై కాలర్ పేరు తప్పనిసరి
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Akhilesh Yadav | ఉత్తర ప్రదేశ్‌లో 19 లక్షల దొంగ ఓటర్లు.. ఎన్నికల సంఘం, సర్‌పై అఖిలేష్ సంచలన ఆరోపణలు
KTR | రూ.3 వేల కోట్ల విదేశీ బొగ్గు స్కామ్ ఆపాలి.. సీఎం రేవంత్‌కు కేటీఆర్ బహిరంగ లేఖ
Faf Du Plesis | ఈ పేస్ త్రయం చాలా డేంజర్.. టెస్టుల్లో వీరిని ఎదుర్కోలేం..!
Delhi Police | రేపే సీజేపీ భారీ నిరసన.. అన్ని జాగ్రత్తలు తీసుకుంటామన్న ఢిల్లీ పోలీసులు
ACB Raid | ఏసీబీకి చిక్కిన విద్యుత్ ఏఈ..రూ.1.20 లక్షల లంచం తీసుకుంటూ పట్టివేత
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

