unknown callers | గుర్తు తెలియని కాలర్స్పై ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఇకపై కాలర్ పేరు తప్పనిసరి
unknown callers : ఇకపై, ప్రతి కాల్‌కు కాలర్ ఐడీ తప్పనిసరి చేస్తూ కేంద్ర నిర్ణయం తీసుకుంది. అంటే, టెలికాం కంపెనీలు ప్రతి కాలర్ పేరు తప్పనిసరిగా డిస్ప్లే చేయాల్సిందే.
unknown callers : మొబైల్ ఫోన్లో సేవ్ చేసుకోని లేదా కొత్త నెంబర్స్ నుంచి కాల్స్ వస్తే వారి పేర్లు డిస్ ప్లే కావు. అన్ నోన్ కాలర్ (గుర్తు తెలియని కాలర్) అని మాత్రమే కనిపిస్తుంటుంది. ఒకవేళ నెంబర్ ఎవరిదో వెంటనే తెలుసుకోవాలంటే ట్రూ కాలర్ వంటి థర్డ్ పార్టీ యాప్స్ వాడాలి. ఇలా, కొత్త నెంబర్స్ నుంచి కాల్స్ వచ్చినప్పుడు అది ఎవరు.. కాల్ లిఫ్ట్ చేయాలా.. వద్దా లాంటి సందేహాలుంటాయి. అయితే, ఇకపై ఇలాంటి గందరగోళానికి చెక్ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది.
ఇకపై, ప్రతి కాల్‌కు కాలర్ ఐడీ తప్పనిసరి చేస్తూ కేంద్ర నిర్ణయం తీసుకుంది. అంటే, టెలికాం కంపెనీలు ప్రతి కాలర్ పేరు తప్పనిసరిగా డిస్ప్లే చేయాల్సిందే. వచ్చే నవంబర్ 1 నుంచి ఈ నిర్ణయం అమలు చేయాలని టెలికాం కంపెనీలను ప్రభుత్వం ఆదేశించింది. కాలర్ ఐడీ కనిపించే ఫీచర్‌ను కాలింగ్ నేమ్ ప్రజెంటేషన్ (సీఎన్ఏపీ)గా పిలుస్తారు. ప్రతి 4జీ, 5జీ ఫోన్లలో కాలర్ ఐడీ డిస్ప్లే కావాల్సిందే. ఈ మేరకు కేంద్ర టెలికాం శాఖ (డీవోటీ) ఆదేశాలు జారీ చేసింది. సీఎన్ఏపీ అమలైతే స్మార్ట్ఫోన్లలో ఒక కాల్ వచ్చిందంటే వారి పేరు నెంబర్‌తోపాటు తప్పకుండా డిస్ప్లే అవ్వాల్సిందే.
కాలర్ నెంబర్ మన మొబైల్లో సేవ్ అయితే ఆ పేరే డిస్ప్లేలో కనిపిస్తుంది. ఒకవేళ కాల్ వచ్చిన నెంబర్ సేవ్ చేసుకుని ఉండకపోతే.. టెలికాం కంపెనీ డాటాబేస్‌లో ఏ పేరుతో సేవ్ అయి ఉంటుందో.. ఆ పేరు కనిపిస్తుంది. ఇంటర్నేషనల్ కాల్స్‌కు మాత్రం పేరు కాకుండా ఇంటర్నేషనల్ కాల్ అని సూచిస్తుంది. సిమ్‌లు జారీ చేసేటప్పుడు టెలికాం కంపెనీలు ఏ పేరు మీద జారీ చేస్తాయో ఆ పేరు.. ఆయా సంస్థల డాటాబేస్ నుంచి డిస్ప్లే అవుతుంది. ఇదే సమయంలో యూజర్ల ప్రైవసీ, సెక్యూరిటీకి ప్రాధాన్యం ఇవ్వాలని డీవోటీ సూచించింది. సీఎల్ఐఆర్ ఫీచర్ ప్రకారం కొందరు కాలర్ల ఐడెంటినీ మాత్రం టెలికాం కంపెనీలు దాచే అవకాశం ఉంది.
వారి పేర్లు మాత్రం భద్రతా కారణాల రీత్యా డిస్ప్లే కావు. ఒక సంస్థ తరఫున కాల్ చేసినా.. లేదా బల్క్ నెంబర్లు తీసుకుని కాల్స్ చేసినా ఒక స్పష్టమైన పేరును ఎంచుకోవాలి. అప్పుడు, ఆ పేరే డిస్ప్లేలో కనిపిస్తుంది. అయితే, ఇక్కడే ఒక చిన్న మెలిక ఉంది. ఈ సంస్థలు తమ ట్రేడ్ మార్క్‌ను రిజిష్టర్ చేసుకోవాలి. అలాగే, జీఎస్టీ గుర్తించిన వ్యాపార సంస్థ పేరు కలిగి ఉండాలి. ప్రస్తుతానికి 4జీ, 5జీ నెట్‌వర్క్‌లకు మాత్రమే ఈ నిర్ణయం వర్తిస్తుంది. అలాగే, 2జీ, 3జీలకు కూడా అమలు చేసే అంశాన్ని పరిశీలిస్తోంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ayushmann Khurrana | ఆయుష్మాన్ ఖురానాకు బెదిరింపు కాల్స్.. కోట్లు డిమాండ్ చేసిన లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్.?
బ్యాంక్ తరలించొద్దని గ్రామస్తుల ధర్నా
జయశంకర్ భూపాలపల్లి జిల్లా డాన్సర్స్ యూనియన్ నూతన కమిటీ ఎంపిక
SKN | రాధికా ఆప్టే వ్యాఖ్యలపై ఎస్కేఎన్ ఫైర్.. పాత వీడియోతో నిర్మాతకు నెటిజన్ల కౌంటర్!
Suicides | అనంతపురం జిల్లాలో విషాదం.. రైలు కిందపడి తల్లి, ఇద్దరు కుమార్తెలు ఆత్మహత్య..!
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

