KTR : భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) అమెరికా పర్యటనకు వెళ్లారు. వారం రోజుల పర్యటన నిమిత్తం మంగళవారం ఉదయం ఆయన అమెరికాకు బయలుదేర్దారు. ఈ పర్యటనలో భాగంగా న్యూయార్క్ నగరంలోని ప్రతిష్టాత్మక కొలంబియా యూనివర్సిటీలో నిర్వహించనున్న అత్యున్నత స్థాయి సదస్సులో కేటీఆర్ పాల్గొననున్నారు.
అమెరికా పర్యటనలో కేటీఆర్ బిజీగా గడపనున్నారు. “కొలంబియా ఇండియా బిజినెస్ కాన్ఫరెన్స్ 2026” (Columbia India Business Conference 2026)లో బీర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కీలక ప్రసంగం చేయనున్నారు. ఈ అంతర్జాతీయ వేదికపై భారతీయ వ్యాపార రంగం, ఆర్థిక సంస్కరణలు, అభివృద్ధి వ్యూహాలపై ఆయన తన అనుభవాలను, అంతర్దృష్టులను పంచుకోనున్నారు. ఈ వ్యాపార సదస్సుతో పాటు, ఈ పర్యటనలో కేటీఆర్ తన కుమారుడు హిమాన్షును కూడా కలవనున్నారు.
Off to the US for a week. Will be speaking at the “Columbia India Business Conference 2026” hosted at Columbia University, NYC
And of course looking forward to seeing my son 😊
— KTR (@KTRBRS) March 31, 2026
వృత్తిపరమైన బాధ్యతలతో పాటు, కొంత సమయాన్ని తన కుటుంబ సభ్యులతో గడపనున్నట్లు ఆయన తన సామాజిక మాధ్యమ వేదిక ‘X’ ద్వారా స్వయంగా వెల్లడించారు. సుమారు వారం రోజుల పాటు అమెరికాలో ఉండనున్న కేటీఆర్ తిరిగొచ్చాక ఎప్పటలానే రాజకీయ కార్యకలాపాల్లో నిమగ్నం కానున్నారు. తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రిగా గతంలో ఆయన సాధించిన విజయాలు, రాష్ట్రాన్ని పెట్టుబడుల గమ్యస్థానంగా మార్చిన తీరును దృష్టిలో ఉంచుకుని కేటీఆర్కు ఈ ఆహ్వానం అందింది.