రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఓకే చెప్పిన ‘సర్ఫేస్ మెజెర్ మెంట్ సిస్టమ్స్’
రాష్ట్ర ఫార్మా రంగంలో మరో అంతర్జాతీయ సంస్థ పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమైంది. ఇంగ్లాండ్‌కు చెందిన
సర్ఫేస్ మెజెర్ మెంట్ సిస్టమ్స్ పెట్టుబడులు పెట్టేందుకు సుముఖత వ్యక్తం చేసింది. పార్టికల్ క్యారెక్టరైజేషన్ లాబొరేటరీ ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ ఐటీ, పరిశ్రమల మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ఇంగ్లండ్‌లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా సర్ఫేస్ మెజెర్ మెంట్ సంస్థ ఎండీ మంత్రి కేటీఆర్‌తో భేటీ అయ్యారు.
హైదరాబాద్‌లో 7 వేల చ.మీ. వైశాల్యంలో ల్యాబొరేటరీ ఏర్పాటు చేస్తామని సర్ఫేస్ మెజర్ మెంట్ సిస్టమ్స్ పేర్కొంది. రెండేళ్లలో దీనిని విస్తరిస్తామని సంస్థ పేర్కొంది. ఈ ల్యాబ్‌ను జాతీయ, అంతర్జాతీయ ఫార్మా కంపెనీల ఔషధ ప్రయోగాలకు వేదికగా చేస్తామని ఆ సంస్థ ఎండీ పేర్కొన్నారు. హైదరాబాద్‌లో సర్ఫేస్ మెజర్ మెంట్ సిస్టమ్స్ ల్యాబ్‌ను ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చినందుకు మంత్రి కేటీఆర్ ఆ సంస్థకు ధన్యవాదాలు తెలిపారు.

ఫార్మా రంగంలో హైదరాబాద్ తిరుగులేని ఆధిపత్యానికి ఇదో నిదర్శనమని మంత్రి కేటీఆర్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఏ రాష్ట్రానికి కూడా లేని అనుకూలతలు హైదరాబాద్‌కు ఉన్నాయని మంత్రి కేటీఆర్ ఈ సందర్భంగా పేర్కొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

