KTR | హైదరాబాద్, ఆగస్టు 17 (నమస్తే తెలంగాణ): ఆల్ ఇండియా సర్వీస్‌కు చెందిన అధికారులను సీఎం రేవంత్‌రెడ్డి తన మీడియా ద్వారా బెదిరింపులకు పాల్పడటమేమిటని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు.
సీఎంకు చెందిన మీడియా సంస్థగా చెప్పబడుతున్న ఓ టీవీ చానెల్ ప్రతినిధి ఐపీఎస్ ఆఫీసర్ కమలాసన్‌రెడ్డిని ఇబ్బందిపెట్టే విధంగా వ్యవహరించిన వీడియోను ఆయన ఎక్స్ ద్వారా షేర్ చేశారు. నిజాయితీ గల ఆఫీసర్ గా పేరున్న కమలాసన్‌రెడ్డిని కావాలనే ఇబ్బంది పెడుతున్నట్టు స్పష్టంగా తెలుస్తుందని, ఇది దిగ్భ్రాంతికరమని అన్నారు. ఇలాంటి చర్యలు అధికారుల మనో నిబ్బరాన్ని దెబ్బతీస్తాయని, దీనికి కాంగ్రెస్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.