KTR | హైదరాబాద్, అక్టోబర్ 20 (నమస్తే తెలంగాణ): వచ్చేనెల 9న మలేషియా రాజధాని కౌలాలంపూర్‌లో జరిగే తెలంగాణ అసోసియేషన్ దశాబ్ది ఉత్సవాలకు రావాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు ఆహ్వానం అందింది. ఆదివారం హైదరాబాద్ నందినగర్‌లోని ఆయన నివాసంలో అసోసియేషన్ అధ్యక్షుడు తిరుపతి, మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ ఆధ్వర్యంలోని ప్రతినిధులు కలిసి కేటీఆర్‌కు ఆహ్వానలేఖ అందించారు. ఈ సందర్భంగా వారికి కేటీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. బీఆర్ఎస్ నాయకులు కార్తీక్‌రెడ్డి, రాకేశ్‌రెడ్డి ఉన్నారు.